టిడిపికి రాయపాటి జలక్ : వైసిపి వైపు చూపులు : రంగంలోకి లోకేష్: కోడెల కీలక వ్యాఖ్యలు..!
Recommended Video

సీనియర్ పార్లమెంట్ సభ్యుడు..టిడిపి ఎంపి రాయపాటి సాంబశివ రావు పార్టీకి జలక్ ఇచ్చారు. వైసిపి నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాయపాటి నర్సరావు పేట నుండి తిరిగి ఎంపీగా పోటీ చేయాలని ఆశిస్తున్నారు. తన కుమారుడికి సత్తెనపల్లి సీటు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ, టిడిపి అధినేత నుండి మాత్రం ఎంపి సీటు పైనా..తన కుమారుడికి సీటు పైనా హామీ లభించలేదు. ఇదే సమయంలో రాయపాటిని బుజ్జగించేందుకు లోకేష్ రంగంలోకి దిగారు.

రాయపాటి అలక..ఆగ్రహం..
నర్సరావు పేట సిట్టింగ్ టిడిపి ఎంపి రాయపాటి సాంబశివ రావు అయిదు సార్లు లోక్‌సభకు..ఒక సారి రాజ్యసభకు ఎన్ని కయ్యారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న రాయపాటి 2014 ఎన్నికల సమయంలో టిడిపి లో చేరారు. నర్సరావుపే ట నుండి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆయన తిరిగి నర్సరావుపేట సీటు ఆశించారు. తనతో పాటు గా తన కుమారుడుకి సత్తెనపల్లి సీటు ఇవ్వాలని కోరారు. దీని పై ముఖ్యమంత్రితో పలు దఫాలు సుదీర్ఘంగా భేటీలు నిర్వహించారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం రాయపాటికి ఎంపి సీటు...రాయపాటి తనయుడు రంగారావుకు సీటు పైనా సీయం నుండి ఎటువంటి హామీ లభించలేదు. నర్సరావుపేట నుండి ఓ విద్యా సంస్థల అధినేత పేరు పరిశీలన కు వచ్చినట్లు సమాచారం. దీంతో..రాయపాటి ఆగ్రహంతో ఉన్నారు.

వైసిపి వైపు చూపులు..రంగంలోకి లోకేష్
రాయపాటి సాంబశివరావు ఒక వైపు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సమయం లోనే వైసిపి నేతలు టచ్ లోకి వచ్చినట్లుగా సమాచారం. ఆయనను వైసిపి లోకి వస్తే సముచిత గౌరవం ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకు న్న సమయంలోనే మంత్రి లోకేష్ రంగంలోకి దిగారు. ఆయన రాయపాటితో ఫోన్ లో మాట్లాడారు. ఎటువంటి తొందర పాటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. రాయపాటిని బుజ్జగించే బాధ్యతలను పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి ..లగడపాటి రాజగోపాల్ కు అప్పగించారు. దీనికి స్పందనగా రాయపాటి తనకు న్యాయం చేస్తారని..సీటు కేటాయిస్తార నే నమ్మకం ఉందని చెబుతున్నారు. అయితే, రాత్రి వరకు వేచి చూసి..ఆ తరువాత నిర్ణయం తీసుకొనే చాన్స్ ఉంది.

కోడెల స్పందన ఇలా..
తన కుమారుడికి సత్తెనపల్లి సీటు ఆశిస్తున్న రాయపాటి అక్కడి పరిస్థితుల పైనా స్పందించారు. కోడెల కు టిక్కెట్ ఇవ్వవద్దని స్థానిక నేతలు చెబుతుంటే ఆయనకే సీటు ఎలా ఇస్తారని రాయపాటి ప్రశ్నించారు. ఇదే సమయంలో సత్తెనపల్లి లో సీటు దక్కించుకున్నా..అసమ్మతి నేతలతో సమస్యలు ఎదుర్కొంటున్న కోడెల శివ ప్రసాద్ స్పందించా రు. రాయపాటి తనకు సిట్టింగ్ సీటు ఇవ్వమని కోరితే తప్పు లేదని..సత్తెనపల్లి సీటు సిట్టింగ్ ఉండ గా అడగటం పై పరోక్షంగా స్పందించారు. అడిగినా..పార్టీ అధినేత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. అసమ్మతి వెనుక కొందరు ఉన్నారని పేర్కొన్నారు. అయితే, తాను వారితో మాట్లాడటానికి సిద్దంగా ఉన్నానని..సత్తెనపల్లి నుండి గెలిచి 15 వేల మెజార్టీ సాధిస్తానని ధీమా వ్యక్తం చేసారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications