సంకల్ప దీక్షలో జై తెలంగాణ, రాయపాటి ఫైర్

 Rayapati Sambasiva Rao
హైదరాబాద్/ నెల్లూరు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద శుక్రవారం సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు చేసిన దీక్షలో ఓ యువకుడు జై తెలంగాణ నినాదాలు చేశాడు. పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు ప్రసంగిస్తుండగా ఆ సంఘటన చోటు చేసుకుంది. జై తెలంగాణ నినాదాలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. యువకుడి నినాదాలపై రాయపాటి సాంబశివ రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆస్తి దోచుకున్నామా, ఇల్లు దోచుకున్నామా అని ఆయన అడిగారు.

కాంగ్రెసు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై రాయపాటి సాంబశివ రావు తీవ్రంగా మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు దారుణమని ఆయన అన్నారు. పొన్నం ప్రభాకర్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీ వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే కలిసి నడుస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ ముసాయిదా బిల్లు సీమాంధ్ర అభివృద్ధి అంశాలు లేవని బిజెపి సీనియర్ నేత కంభంపాటి హరిబాబు అన్నారు. పూర్తి అసంబద్ధంగా తెలంగాణ బిల్లును రూపొందించారని ఆయన విమర్శించారు పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్రకు న్యాయం జరగకుండా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వవద్దని తాము అధిష్టానాన్ని కోరుతామని ఆయన చెప్పారు.

పోలవరానికి న్యాయం జరగాలంటే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ప్రమేయం లేకుండా ప్రాజెక్టు డిజైన్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతవరకు ఏ రెండు రాష్ట్రాలకు కూడా ఒకే ప్రాంతం ఉమ్మడి రాజధానికి లేదని అన్నారు. నెల్లూరులో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

విభజన బిల్లులో రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయని హరిబాబు విమర్శించారు. కొత్త రాజధానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని, రాయలసీమ ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బిల్లుపై రెండు ప్రాంతాల వారికి కూడా అభ్యంతరాలు ఉన్నాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+