నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్ద రీ సర్వే, ఆక్రమిస్తే..
హైదరాబాద్: సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు శుక్రవారం రీ-సర్వే ప్రారంభించారు. తుమ్మిడికుంట చెరువును అధికారులు సర్వే చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, సాగునీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు ఎన్ కన్వెన్షన్ వద్ద చెరువు రీసర్వే నిర్వహిస్తున్నారు.
తమ్మిడికుంట చెరువు భూమిని ఆక్రమించుకున్నట్లు ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై అధికారులు తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున హైకోర్టును ఆదేశించారు. నోటీసులు ఇచ్చాక సర్వే చేయాలని కోర్టు జీహెచ్ఎంసీ అధికారులకు సూచించింది.

దీంతో ఇటీవల నాగార్జునతో సహా తుమ్మిడికుంట చెరువును పరిధిలోని పలువురికి నోటీసులు ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు చెరువు హద్దులు తేల్చేందుకు అధికారులు రీ-సర్వే నిర్వహిస్తున్నారు. చెరువు పూర్తి స్థాయి నీటిమట్టం వరకు హద్దులు నిర్ధారిస్తున్నారు. సర్వే అనంతరం భూమి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని శేరిలింగంపల్లి తహసీల్దార్ చెప్పారు.












Click it and Unblock the Notifications