వేణుస్వామి దెబ్బకు ప్రభాస్ కూడా జాతకాలను నమ్ముతున్నాడు?
ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి చెప్పినవి కొన్ని నిజమవడంతో హీరోలు, హీరోయిన్లు ఆయనచేత జాతకాలను చూపించుకోవడం కోసం క్యూ కట్టడమేకాదు.. పూజలు కూడా చేయించుకుంటున్నారు. రష్మిక, నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు దోష పరిహారాలను చేయించుకున్నారు. ఇటీవలే రామబాణం, ఖిలాడీ సినిమాల్లో నటించిన డింపుల్ హయతి కూడా పూజలు చేయించుకుంది.
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్, ఆయన తనయుడు బాలకృష్ణ జాతకాలను నమ్ముతారనే విషయం తెలిసిందే. వేణుస్వామి ఇటీవలే ప్రభాస్ కు సంబంధించిన జాతకం చెప్పారు. ఆయన చెప్పినట్లే సాహో, రాధేశ్యామ్ డిజాస్టర్లుగా మిగిలాయి. ఆదిపురుష్ కూడా బాహుబలి రేంజ్ లో హిట్టవదని, సాధారణ సినిమాగానే నిలుస్తుందని వేణుస్వామి చెప్పాడు. ఆయన చెప్పినట్లే జరుగుతుండటంతో ప్రభాస్ ఏం చేస్తాడా? అనే ఆసక్తి అందరిలో వ్యక్తమవుతోంది.

ప్రభాస్ జాతకాలను నమ్మడు.. ఆయనకు జాతకాలమీద నమ్మకం ఉండదు అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతుంటాయి. అయితే తాజాగా ఒక విషయాన్ని పరిశీలిస్తే ప్రభాస్ కూడా జాతకాలను నమ్ముతున్నారా? అని ఆశ్చర్యపోవడం జరుగుతుంది. సలార్ సినిమా టీజర్ ను ఈనెల 6వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదల చేయబోతున్నట్లు సినిమా యూనిట్ ప్రకటన చేసింది. అయితే టీజర్ ను ఎవరూ నిద్రలేవని సమయమైన ఉదయం 5.12 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపింది.
ఆ సమయంలో ఎందుకు చేయబోతున్నారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సాధారణంగా అందరూ ఉదయం లేదంటే మధ్యాహ్నం విడుదల చేస్తారు. తెల్లవారుజామున విడుదల చేయడమంటే ప్రభాస్ కూడా జాతకాలను నమ్ముతున్నాడా? అనే చర్చ నడుస్తోంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం టీజర్ విడుదలయ్యేంతవరకు ఓపిక పట్టాలి.












Click it and Unblock the Notifications