కృష్ణమ్మ మహోగ్రరూపం.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా గత 48 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో పాటు ఈదురు గాలుల ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో మాత్రమే కాకుండా, కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది .

కృష్ణా నదికి పోటెత్తిన వరద
కృష్ణానదికి వరద పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. గతంలో రోజుకు లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయగా, నేడు ఈ ప్రవాహం నాలుగు లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో బ్యారేజీలోని 70 గేట్లను పూర్తిగా ఎత్తి మిగులు జలాలను విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ ప్రస్తుత నీటి మట్టం 12 అడుగులకు చేరుకోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

Red alert for Krishna river basin areas in ap as the flood water released into sea from prakasham barrage

కృష్ణమ్మ ఉగ్రరూపం.. అప్రమత్తం అయిన అధికారులు
కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చడంతో వరదనీటిని దిగువకు వదులుతున్న క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ ఏర్పాటుచేసి అధికారులు ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకుంటున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని సచివాలయాల సిబ్బంది, ప్రజలను నది ప్రాంతాలకు వెళ్లకుండా హెచ్చరిస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో నిరంతరం సమీక్షిస్తూ, అవసరమైతే లోతట్టు, లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద
ఇదిలా ఉంటేఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో వరద ఉధృతి కొనసాగుతోంది... ఎగువ నుంచి దాదాపు 3లక్షల 30వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా వివిధ మార్గాల ద్వారా అంతే నీటిని దిగకు విడుదల చేస్తున్నారు.. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.80అడుగులుగా ఉంది.

నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు
వరద ఉధృతి ఎక్కువ గా ఉండటంతో ప్రాజెక్టు 26క్రెస్ట్ గేట్ల ద్వారా 2లక్షల 70వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.. విద్యుత్ ఉత్పత్తి తోపాటు కుడి, ఎడమ కాలువల కు నీటిని విడుదల చేయడం ద్వారా మరో 50వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలంకు జూరాల, సుంకేసుల జలాశయాల ద్వారా 3లక్షల 20వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.

శ్రీశైలంలో 3లక్షల 15వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
క్రెస్ట్ గేట్లు, కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా దాదాపు 3లక్షల 15వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.. సాగునీటి అవసరాల నిమిత్తం పోతిరెడ్డి పాడు ద్వారా మరో 30వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+