పవన్ కల్యాణ్ వార్నింగ్, ఎర్రచందనం స్మగర్లకు, అధికారులకు తడిచిపోయింది, లెక్కలు
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎర్ర చందనం దర్జాగా తరలించేశారని ఆరోపణలు ఉన్నాయి. అటవి శాఖలోని పెద్ద తలకాయల అండదండలతో వైసీపీ నాయకులు ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు అటవి శాఖ అధికారులతో పాటు పోలీసుల్లో చలనం వచ్చిందని తెలిసింది.
ఇంతకాలం మాట వినని అటవి శాఖ అధికారులు, సిబ్బంది, పోలీసులకు రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్టణంకు బదిలి చేశారు. నిబందనలకు విరుద్దంగా బదిలి చేసిన ఆ అధికారులు సిబ్బంది ఇప్పుడు మా భాగోతం ఎక్కడ బయటపెడుతారో అని ఇంతకాలం ఎర్రచందనం తరలించిన కొందరు నాయకులు హడలిపోతున్నారని తెలిసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం మాయం అయ్యిందని ఆరోపణలు ఉన్నాయి.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులు, సదాశివకోన, తలకోన, నాగలాపురం, పిచ్చాటూరు తదితర అటవి శాఖ పరిధిలో విపరీతంగా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఎర్రచందనంకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. పుష్పా సినిమా టైపులో ఎర్రచందనం స్మగ్లింగ్ కు స్కెచ్ వేసిన కొందరు నాయకులు చెన్నైలోని స్మగ్లర్లతో డీల్ మాట్లాడుకున్నారని, ఇంతకాలం అక్రమ మార్గాల్లో చెన్నైకి ఎర్రచందనం తరలించారని, అక్కడి నుంచి విదేశాలకు తరలించారని ఆరోపణలు ఉన్నాయి.
తరువాత తమిళనాడు నుంచి కూలీలను పిలిపించుకుని రోజు వారికి వేలాది రూపాయలు కూలీలు ఇచ్చి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లు కొట్టించారు. తరువాత వైసీపీ నాయకుల అండదండలతో ఎర్రచందనం దుంగలను అక్రమ మార్గాల్లో చెన్నైకి తరలించి వాటిని విక్రయించి భారీ మొత్తంలో డబ్బులు సంపాధించారని ఆరోపణలు ఉన్నాయి. చెక్ పోస్టుల్లో సహకరించని సిబ్బందిని అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు వారిని వేరే జిల్లాలకు బదిలి చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఇంత దర్జాగా ఎర్రచందనం తరలిపోతున్నా గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని, అప్పటి అధికార పార్టీకి చెందిన అటవి శాఖ పెద్దలకు పూర్తిగా సహకరించారని, చిన్నాచితకా కేసులు నమోదు చేసి చేతులు దుపులుపుకున్నారని ఆరోపణలు ఉన్నాయి ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్ల మీద కేసులు నమోదు చెయ్యకుండా తమిళనాడుకు చెందిన కూలీల మీద కేసులు నమోదు చేసి కొన్ని కొన్ని ఎర్రచందనం దుంగలను రికవరీ చేసినట్లు కొందరు అధికారులు నాటకాలు ఆడారని ఆరోపణలు ఉన్నాయి.

చెప్పినట్లు వినని కొందరు అధికారులను ఏదోఒక సాకుతో సస్పెండ్ చెయ్యడం, డిప్యుటేషన్ మీద వేరే ప్రాంతాలకు పంపించిన వైసీపీ నాయకులు అక్రమ మార్గాల్లో దర్జాగా ఎర్రచందనం వ్యాపారం చేశారని, తమిళనాడులోని చెక్ పోస్టుల్లో సిబ్బందిని కూడా వీరు ప్రలొభపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్లు ఎవరైనా సరే వదిలిపెట్టమని, పాత కేసులు తిరగతోడుతామని, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారికి సహకరించే అధికారులను కూడా వదిలిపెట్టనని డీసీఎం పవన్ కల్యాణ్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, బాకరాపేట, చంద్రగిరి, పీలేరు, మదనపల్లె, గుడుపల్లె, తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్ ప్రాంతాల్లో పని చేస్తున్న అటవి శాఖ అధికారులు, చెక్ పోస్టుల సిబ్బందికి ఇప్పుడు దడ మొదలైయ్యిందని తెలిసింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
వృద్దులు, 12 ఏళ్లలోపు పిల్లలకు టీటీడీ ముఖ్య గమనిక -
ఈ నెల 30 నుంచి తిరుమలలో -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications