ఏపీలో రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవోలు 393, 94, 95లను విడుదలచేసింది. దీంతో స్టాంప్ డ్యూటీ 4 నుంచి 5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజును 0.5 శాతం నుంచి ఒక శాతానికి పెంచింది.

ఇక కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఒప్పందాలపై ఒక శాతం ఫీజు, ఇతర ఒప్పందాలపై 6 నుంచి 3 శాతానికి ఫీజును సవరించారు. రిజిస్ట్రేషన్ ఫీజులకు సంబంధించి 2013 మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన ప్రభుత్వం, తాజా ఉత్తర్వులు ఇచ్చింది.

registration-stamp-duties-hiked-in-andhra-pradesh

ఈ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతూ తీసుకున్న నిర్ణయ ఫైలుకు జపాన్ పర్యటనకు వెళ్లకముందే సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు కొత్త వాహనాలు:

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ.100 కోట్లతో 2,422 వాహనాలు కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+