CM Jagan: కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన సీఎం జగన్..
సీఎం జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనిచ్చిన మాట ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఇచ్చింది. క్రమబద్దీకరణ కోసం గైడ్ లైన్స్ కూడా విడుదల చేశారు. దీని ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో 2014 ఏప్రిల్ ఒకటి నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులగా పనిచేస్తున్నవారు క్రమబద్ధీకరణకు అర్హత పొందుతారు.
ఇలా అర్హులైన 2146 మందిని క్రమబద్దీకరిస్తూ వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. క్రమబద్దీకరించిన వారిలో పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ ఫేర్ విభాగంలో 2025 మంది వైద్య సిబ్బంది, డిఎంఈ పరిధిలో 62, కుంటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాలలో నలుగురు ఉద్యోగులు ఉన్నారు. సీఎం జగన్ పాదయాత్ర సందర్భంగా క్రాంటాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

సీఎం జగన్ ఉమెన్స్ డేకు ముందు రోజు మహిళలకు ఆర్థిక సాయం చేశారు. 58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల అభివృద్ధే లక్ష్యంగా పని చేసినట్లు చెప్పారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరిందన్నారు. చేయూత నిధుల పంపిణీ 14 రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. చేయూత ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.75వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
అమ్మఒడి పథకం ద్వారా 53లక్షల మంది తల్లులకు తమ ప్రభుత్వంగా బాసటగా నిలిచిందని జగన్ అన్నారు. పిల్లల చదువుల కోసం వైసీపీ ప్రభుత్వం భారీగా ఖర్చు పెడుతుందన్నారు. గత ప్రభుత్వం ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మహిళల రక్షణ కోసం దిశా యాప్, దిశా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు సీఎం గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications