జియో సిమ్ కార్డు వాడేవారికి శుభవార్త
మీ మొబైల్ ఫోన్ లో జియో(Reliance Jio) కంపెనీకి చెందిన సిమ్ కార్డును ఉపయోగిస్తున్నట్లైతే మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఉచితంగా 4 జీబీ డేటాను పొందొచ్చు. ఐపీఎల్ మ్యాచ్ లను దృష్టిలో పెట్టుకొని కంపెనీ ఈ అదనపు ప్రయోజనాన్ని కల్పిస్తోంది. రిలయన్స్ జియో ప్రస్తుతం రూ.61 డేటా యాడ్ ఆన్ బూస్టర్ ప్లాన్‌పై (Rs 61 Data Plan) 10 జీబీ డేటాను అందిస్తోంది.

ఈ పథకంద్వారా గతంలో 6 జీబీ ఇచ్చేవారు. కంపెనీ దాన్ని 10జీబీకి పెంచింది. 4 జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. తన అధికారిక వెబ్ సైట్ లో కంపెనీ ఈ విషయాన్ని తెలియజేసింది. ఎక్కువ డేటా కోరుకునే యూజర్లకు ఈ పథకం బాగా కలిసివస్తుంది. అయితే ఈ పథకాన్ని రీఛార్జి చేసుకునేముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం డేటా బూస్టర్ ప్లాన్. ఇప్పటికే మీ సిమ్ కార్డుపై యాక్టివ్ రీచార్జి ప్లాన్ ఉంటేనే ఇది వర్తిస్తుంది.

నెల అంతకంటే ఎక్కువ వ్యాలిడిటీ ఉన్న పథకాలు మీ ఫోన్ లో ఉండాలి. రోజువారీ ప్లాన్ కింద డేటా అయిపోతే డేటా బూస్టర్ కింద అదనపు డేటాను వాడుకోవచ్చు. అదనపు డేటా అందుతుండటంతో రోజువారీ డేటా అయిపోతుందన్న చింతే వద్దు. జియో రూ.15 ప్యాక్‌తో 1 జీబీ డేటా ఇస్తోంది. అదే రూ.25 ప్లాన్ అయితే 2 జీబీ డేటా, రూ.61 రీచార్జ్ ప్లాన్‌తో 10 జీబీ డేటా, రూ.121 ప్లాన్ ద్వారా 12 జీబీ డేటాను పొందొచ్చు. రూ.222 రీచార్జ్ ద్వారా 50 జీబీ డేటా వస్తుంది. ఎక్కువ డేటా ఉపయోగించేవారికి ఈ పథకం అనువుగా ఉంటుంది.












Click it and Unblock the Notifications