ఎంపి రేణుక కొత్త ఎత్తు: వైసిపిలోనే ఉంటా, కానీ ...

తన నియోజకవర్గం అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని కలిసానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని ఆమె అన్నారు. కర్నూలు చాలా వెనుకబడి ఉందని, అనేక సమస్యలు ఉన్నాయని, నీటి సమస్య ఉందని, నిరుద్యోగం ఇలా చాలా సమస్యలు ఉన్నాయని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు వాగ్ధానాలు చేశానని బుట్టా రేణుక అన్నారు.
అవన్నీ చేయాలంటే తనకు మద్దతు కావాలని అందుకే చంద్రబాబు నాయుడుని కలిసి మాట్లాడానని ఆమె తెలిపారు. వైసిపి అధిష్టానం తనపై వేటు వేస్తే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే సత్తా ఉంటే పోటీ చేస్తానని, లేకపోతే సామాజిక సేవ చేసుకుంటానని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా బుట్టా రేణుక స్పష్టం చేశారు.
నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి ఆదివారం తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తీవ్రమైన కలవరం ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications