Repalle gang rape: దారుణ ఘటనపై స్పందించిన మంత్రులు, వాసిరెడ్డి పద్మ

బాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లెలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ముందే కిరాతకానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన భర్తను దారుణంగా కొట్టారు. రేపల్లె రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి ఈ అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రేపల్లెకు చేరుకున్నారు.

ఈ ఘటన పట్ల మంత్రులు విడదల రజిని, మేరుగ నాగార్జున, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంతటి వారైనా వదిలపెట్టబోమని తేల్చి చెప్పారు. రైల్వే స్టేషన్లల్లో భద్రత, రైల్వే రక్షక బలగాల గస్తీ కట్టుదిట్టంగా ఉంటుందని, ఎక్కడ లోపం జరిగిందనేది తెలుసుకుంటున్నామని వాసిరెడ్డి పద్మా అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా ఎస్పీ, ఇతర అధికారులతో మాట్లాడారని గుర్తు చేశారు.

 Repalle gang rape: reactions from Ministers Vidadala Rajini, Meruga Nagarjuna and Womens commission

నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని, మహిళా కమిషన్ తరఫున వారిపై ఎలాంటి శిక్షలు విధించాలనే విషయంపై పోలీసు యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. రైల్వేస్టేషన్‌లల్లో భద్రత పట్ల అక్కడి అధికారులతో చర్చిస్తున్నామని, సమగ్ర నివేదిక ఇవ్వాలని రైల్వే అధికారులను కోరామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. వారిని మహిళా కమిషన్ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించామని అన్నారు.

రైల్వే స్టేషన్‌లో అత్యాచారం చోటుచేసుకోవడమనేది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని వ్యాఖ్యానించారు. ఒక బలమైన రక్షణ వ్యవస్థలో రైల్వే స్టేషన్లు భాగమని, అలాంటి చోట లోపం చోటు చేసుకుంటోందని చెప్పారు. ఈ ఘటనపై మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. అత్యాచారం చేసిన నిందితులు ఎలాంటి వారైనా వదిలి పెట్టబోమని, కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. చివ్వూరు, తుమ్మపూడి, విశాఖపట్నంలో జరిగిన నేరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రమేయం ఉందని అన్నారు.

నేరాలకు పాల్పడిన వారిని వదిల పెట్టబోమని తేల్చిచెప్పారు. రేపల్లె అత్యాచార ఘటన కలచి వేసిందని, ఎలాంటి వారైనా కఠినంగా శిక్షించి తీరుతామని చెప్పారు. రేప‌ల్లె రైల్వే స్టేష‌న్ లో మ‌హిళ‌పై అత్యాచార ఘ‌ట‌న అత్యంత బాధాక‌రమని మంత్రి విడదల రజిని అన్నారు. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారని, నిందితుల‌కు క‌ఠిన శిక్ష ప‌డే వ‌ర‌కు వ‌దిలిపెట్టబోమని అన్నారు. జిల్లా ఎస్పీ, బాధితురాలు చికిత్స పొందుతున్న ఆసుపత్రి అధికారుల‌తో మాట్లాడానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+