నాకివ్వండి ఎలాగో చూపిస్తా, బ్రహ్మాస్త్రం: రిజైన్లపై హరికృష్ణ

Harikrishna
హైదరాబాద్: సీమాంధ్ర కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులవి ఉత్తుత్తి రాజీనామాలేనని, వారు తమ చేతికి రాజీనామాలను ఇస్తే ఎలా ఆమోదింప చేసుకోవాలో చూపిస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ అన్నారు. రాష్ట్ర సమైక్యతకు పార్లమెంటు సభ్యులు రాజీనామాలే ఆఖరి బ్రహ్మాస్త్రం అన్నారు.

ఉత్తుత్తి రాజీనామాలు చేయవద్దని, వాటిని తమ చేతికి ఇస్తే తాను ఆమోదింప చేస్తానన్నారు. తెలుగువాడి కడుపుమంటలో కాంగ్రెసు కాలిపోతుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నెలకొల్పుతున్న నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ విభజనకు మద్దతు తెలపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ సొంత రాష్ట్రంలో అపజయాల కేటుగాడని, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఇనుపగజ్జెల పాదచారి అని హరికృష్ణ విమర్శల గుప్పించారు.

ప్యాకేజీల ప్రస్తావన ఏది?: సోమిరెడ్డి

విభజన బిల్లుపై న్యాయశాఖ ప్రతిపాదనలకు భిన్నంగా వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా మండిపడ్డారు. 371డి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వర్తించేలా రాజ్యాంగ సవరణ చేసి మళ్లీ ఎలా మారుస్తారో చెప్పాలని ప్రశ్నించారు.

విభజన తర్వాత రాజధాని ఏర్పాటు కోసం కమిటీ వేస్తారా అని ప్రశ్నించారు. రాజధానిని అడవిలో నిర్మిస్తారా అన్నారు. ప్యాకేజీల ప్రస్తావన ఎక్కడా లేదని దుయ్యబట్టారు. కేబినెట్ రాష్ట్రపతిని కూడా మోసగిస్తోందని ఆరోపించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని ఓడించి ప్రజలు సోనియాకు పుట్టిన రోజు బహుమతిని ఇచ్చారని, ఇకనైనా ఆమె నియంతలా ఆలోచించడం మానుకోవాలన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అడ్డు పెట్టుకొని దేశాన్ని నాశనం చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+