విజయవాడ ప్రజలను భారీ ప్రమాదం నుంచి కాపాడిన వైఎస్.జగన్

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు వర్షాల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని తెలిపారు. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు.

తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.రెండో ప్రమాద హెచ్చరిక సైతం జారీ చేశారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో కృష్ణానదికి వరద ఉధృతిపెరుగుతోంది. కర్ణాటకలోని నారాయణపూర్‌ జలాశయం నుంచి 95 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండటంతో కృష్ణానది తీరాన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

retaining wall is a permanent solution for the people of Krishna Lanka

అయితే గతంలో ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడు వరదలు వచ్చినా... కృష్ణలంక ఏరియా మునిగిపోతుంది. లక్షల క్యూసెక్కుల వరద వచ్చి పేదల ఇళ్లను ముంచేస్తుంది. కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతున్న సమయంలో కృష్ణలంక ప్రజలను అక్కడ నుంచి తరలించి పునరావాస కేంద్రాలకు తరలించేవారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు తమ ఇళ్లకు చేరుకునేవారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చొరవతో కృష్ణలంక ప్రజలకు శాశ్వత పరిష్కరం దక్కింది.

కృష్ణలంక ప్రజలను వరదలను నుంచి కాపాడటానికి కనకదుర్గ వారధి నుంచి కోటినగర్‌ వరకు 2.6 కిలోమీటర్ల పొడవునా ఈ రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించింది అప్పటి జగన్ సర్కార్. 125 కోట్ల వ్యయంతో మూడు అడుగుల వెడల్పుతో 18 మీటర్ల లోతులో ర్యాఫ్ట్‌ పద్ధతితో, 8.9 మీటర్ల ఎత్తులో కాంక్రీట్‌ రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించడం జరిగింది. ఇప్పుడు కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వర ఉధృతి పెరిగినప్పటికి రిటైనింగ్‌ వాల్‌ కారణంగా కృష్ణలంక ప్రాంత సురక్షింతంగా ఉన్నారు. మాజీ సీఎం జగన్ ముందు చూపు చొరవతో నిర్మించిన ఈ రిటైనింగ్‌ వాల్‌ వల్ల కృష్ణలంక ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరికిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+