జగన్ చేసిందే మీరూ చేయాలా ? చంద్రబాబుకు ఏబీవీ ఘాటు కౌంటర్..!
ఒకప్పుడు ఏపీలో సీఎం చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసి, జగన్ కు టార్గెట్ అయి, సస్పెన్షన్ వేటు కూడా ఎదుర్కొన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao).. ఈసారి కూటమి ప్రభుత్వంలో తనకు మంచి ప్రాధాన్యం దక్కుతుందని భావించారు. కానీ జగన్ హయాంలో జరిగిన వేధింపుల విషయంలో తనకు అండగా నిలిచిన టీడీపీ.. అధికారంలోకి వచ్చాక కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు. అదే సమయంలో ఆయన తాజాగా వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి ఓ వేదిక పంచుకున్నారు. దీంతో టీడీపీ భగ్గుమంటోంది.
టీడీపీకి అనుకూలంగా ఉండే అధికారిగా పేరు తెచ్చుకున్న ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై పోలీసులు ఉపా కేసు ప్రయోగించడంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ కేసు చెల్లదని కూడా తేల్చిచెప్పేశారు. దీంతో గుర్రుగా ఉన్న టీడీపీ శ్రేణులకు ఆ తర్వాత ఆయన అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడం కూడా నచ్చలేదు. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావుపై సోషల్ మీడియాలో టీడీపీ దాడి మొదలుపెట్టింది. దీనిపై ఏబీవీ ఇవాళ స్పందించారు. అంబటి రాంబాబు తో వేదిక ఎలా పంచుకున్నావు? ఎవర్ని చూసినా అదే ప్రశ్న. అందరికీ కలిపి సమాధానం ఇస్తున్నానంటూ ఓ ట్వీట్ చేసారు.

అంబటి రాంబాబు తో వేదిక ఎలా పంచుకున్నావు? ఎవర్ని చూసినా అదే ప్రశ్న. అందరికీ కలిపి సమాధానం ఇస్తున్నాను
— ABV (@abvrao) July 12, 2026
మాట్లాడే స్వేచ్ఛ అంటే అర్థం తెలుసా అసలు? జగన్ అసలు మాట్లాడనిచ్చాడా? ఈ ప్రభుత్వం కూడా అదే చేయాలనుకుంటోందా? పక్కన ఉన్న నేనే అంబటి ఏం మాట్లాడాడో వినలేదు. Just ignored. Why can’t…
ఇందులో మాట్లాడే స్వేచ్ఛ అంటే అర్థం తెలుసా అసలు? జగన్ అసలు మాట్లాడనిచ్చాడా? ఈ ప్రభుత్వం కూడా అదే చేయాలనుకుంటోందా? అని ఏబీవీ ప్రశ్నించారు. పక్కన ఉన్న నేనే అంబటి ఏం మాట్లాడాడో వినలేదు, Just ignored. Why can't you do the same? Just ignore? (నేను పట్టించుకోలేదు, మీరూ ఆ పని చేయలేరా ?, వదిలేయండి) అంటూ ఏబీవీ జవాబిచ్చారు. అంబటి నా పక్కన కూర్చుంటే నేను లేచి వెళ్లిపోవడం సభా మర్యాదా? పిలిచిన పెద్దలు ఏమనుకుంటారు? నేను నా మర్యాద నిలుపుకోవద్దా? మీ అందరితో హీరో అనిపించుకోవడం కోసం నేను సంస్కారం వదిలెయ్యాలా? మీరు నా గురించి పొరబడ్డారు, నేనలాంటి వాడిని కాదు అంటూ ఏబీవీ క్లారిటీ ఇచ్చారు. మళ్లీ ఇందులోకి రావణ్ ప్రస్తావన తేవద్దు, అది ఇంకో పోస్టు లోనో సందర్భం లోనో వివరంగా చెబుతానంటూ ఏబీవీ ముగించారు.












Click it and Unblock the Notifications