కరెక్షన్.. కియా: ట్వీట్ డిలేట్ చేసిన రాయిటర్స్..!
అమరావతి: కొద్ది రోజులుగా రాష్ట్రంలో రాజకీయంగా తీవ్రస్థాయిలో దుమారానికి దారి తీసిన వివాదం.. కియా మోటార్స్. అనంతపురం జిల్లా పెనుకొండలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఈ సంస్థ తమిళనాడుకు తరలిపోయే అవకాశం ఉందంటూ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ చేసిన ఓ ట్వీట్ దీనికి కారణమైంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య ఆకాశమే హద్దుగా విమర్శలు, ప్రతి విమర్శలకు కారణమైన ట్వీట్ అది.

దీన్ని శనివారం తొలగించింది రాయిటర్స్ వార్తా సంస్థ. ఈ ట్వీట్‌ను డిలేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ట్వీట్‌ను తొలగించడానికి గల కారణాన్ని కూడా వివరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన వివరణను దృష్టిలో ఉంచుకుని ట్వీట్‌ను తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఇదివరకు తాము చేసిన ట్వీట్ సరైనది కాదని ప్రకటించింది. సరైన ట్వీట్ కాకపోవడం వల్లే దాన్ని డిలేట్ చేస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ స్పష్టం చేసింది.
https://twitter.com/ReutersIndia/status/1226052101299675136?s=20
కియా వార్తా సంస్థ ఎక్కడికీ వెళ్లట్లేదంటూ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇదివరకే వెల్లడించారు. ఆటో ఎక్స్‌పో సందర్భంగా ఆయన కియా మోటార్స్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. కియా మోటార్స్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సైతం దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. కియా కార్ల తయారీ కేంద్రాన్ని ఎక్కడికీ తరలించట్లేదని, రాయిటర్స్ వార్తా సంస్థ చేసిన ట్వీట్ నిరాధారమైనదని వెల్లడించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications