వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌పై తెరాస గూండాల దాడి, హిట్లర్ కేసీఆర్!: లోకేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ శుక్రవారం విమర్శలు గుప్పించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అంశంపై ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. రేవంత్ రెడ్డి పైన తెలంగాణ రాష్ట్ర సమితి గూండాలు దాడి చేశారన్నారు. తెలంగాణను రౌడీలు పాలిస్తున్నారన్నారు. లా అండ్ ఆర్డర్ నియంత్రణలో లేదని, హిట్లర్‌లా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు.

తమ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ ఆర్థిక ఫోరంలో ఏపీని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంటే, కేసీఆర్ అండ్ కో మాత్రం విద్వేషాలను రెచ్చగొట్టే పనిలో ఉందన్నారు. ఇది చాలా దురదృష్టకరమని లోకేష్ ఇటీవల పేర్కొన్నారు.

'Revanth Reddy attacked by TRS goons'

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పైన శ్వేతపత్రం విడుదల చేయాలని, విద్యుత్‌ను హైదరాబాదుకు ఎంత వినియోగించారు, రైతులకు ఎంత వినియోగించారో చెప్పాలని, అది వారి బండారం బయటపెడుందని అంతకుముందు పేర్కొన్నారు.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Revanth Reddy attacked by TRS goons. Government run by rowdies, Law & Order out of control. <a href="https://twitter.com/hashtag/HitlerCM?src=hash">#HitlerCM</a> is ruling!</p>— Lokesh Nara (@naralokesh) <a href="https://twitter.com/naralokesh/status/533190481677934592">November 14, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

రేవంత్ రెడ్డి నివాసం ఎదుట తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆందోళన చేయడం అప్రజాస్వామికమని తెలంగాణ టీడీపీ అభిప్రాయపడింది. ప్రజాసమస్యలపై, అవినీతి అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే వారి ఇంటి ముందు నిరసనలు చేపడ్డం సరైన సంస్కృతి కాదని పార్టీ హితవు పలికింది. ప్రజాసమస్యలు అసెంబ్లీలో లేవనెత్తడం తప్పా? అని ప్రశ్నించింది. ఇలాంటి ఆందోళనలు, నిరసనలకు భయపడేది లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.

తమ పార్టీ సభ్యుల వల్లే సభా సమయం వృథా అన్న తెరాస నేతల వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద సండ్ర మాట్లాడారు. రికార్డులను పరిశీలిస్తే ఎవరు ఎలా మాట్లాడుతున్నారో తెలుస్తుందన్నారు.

ఏబీఎన్‌, టీవీ9 చానళ్ల ప్రసారాలను నిలిపివేసి మీడియాను గుప్పిట్లో పెట్టుకోవాలని చూసినట్లే సభలో ఒక పార్టీని టార్గెట్‌ చేసి ప్రతిపక్షాలను ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తమను గెలిపించిన ప్రజలకే తొత్తులమన్నారు. పత్రికా కథనాలపై మాట్లాడవద్దనడం బాధాకరమన్నారు. అధికార పార్టీయే సభలో అన్‌పార్లమెంటరీ భాష వాడిందన్నారు.

English summary
'Revanth Reddy attacked by TRS goons. Government run by rowdies, Law & Order out of control. #HitlerCM is ruling!'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X