వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయటకు రావాలి: రేవంత్, దుర్మార్గం: కెసిఆర్‌పై ఎర్రబెల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారులోని రాజేంద్ర నగర్ భూదౌర్జన్యాలపై ప్రభుత్వం స్పందించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 40 ఎకరాల భూమిని ఆక్రమించుకున్న ప్రవీణ్ రావు అక్రమాలను అడ్డుకోవాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నారని ఆయన విమర్శించారు.

శ్మశానాలను, ప్రార్థనా స్థలాలను కూడా ఆక్రమిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత నెల 22వ తేదీన కేసు నమోదు అయితే ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన అడిగారు. ప్రవీణ్ రావు అరెస్టును అడ్డుకున్నదెవరో బయటకు రావాలని ఆయన అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Revanth Reddy demands enquiry on land kabja

నిజాం పరిపాలనను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రశంసించడం దుర్మార్గమని తెలంగాణ తెలుగుదేశం శానససభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రయోజనం కోసమే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కెసిఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ముస్లిం ఓట్లను పొందేందుకు కెసిఆర్ ఆరాటపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కబ్జా చేస్తే చర్యలు

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటామని తెలంగామ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఆయన శుక్రవారంనాడు హైదరాబాదులోని బేగంపేట ప్రాంతంలో పర్యటించారు. రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి 194 సర్వే నెంబర్ భూములను పరిశీలించారు. 194 సర్వే నెంబర్ భూములను 3 రోజుల్లో సర్వే చేసి, విేదిక అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

English summary
telugudesam Telangana leader Revanth Reddy alleged that Praveen Rao was illegally occupying lands at Rajendra Nagar in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X