బాబుపై అవే సరిపోవు! టేప్ ఆధారంగా రేవంత్‌కి ప్రశ్న
హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు చెందినదిగా విడుదలైన ఆడియో టేప్ వివాదం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది. చంద్రబాబు, స్టీపెన్ సన్‌ల మధ్య అందులో సంభాషణలు ఉన్నాయి. అయితే, చంద్రబాబు పైన చర్యలకు అది మాత్రమే సరిపోదని న్యాయనిపుణులు చెబుతున్నారు.
ఫోన్‌లోని సంభాషణల్లో చంద్రబాబు మాట్లాడారా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపిస్తే తెలుస్తుందంటున్నారు. అప్పుడే వీటిని ఆధారాలుగా చెప్పవచ్చునని అంటున్నారు. చంద్రబాబు, స్టీపెన్ సన్‌ల మధ్య సంభాషణలను మెటిరిలయల్ ఎవిడెన్స్‌గా ఉంటాయంటున్నారు.
ఒకవేళ ఇది చంద్రబాబుదే అయితే, అందులో చంద్రబాబు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ సన్‌కు డబ్బులు ఇవ్వజూపినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. అయితే, మరిన్ని ఆధారాలు లేకుండా ఏసీబీ ఆ ఆడియోలను విడుదల చేసే సాహసం చేయకపోయి ఉండేదని అంటున్నారు.
రేవంత్ విచారణ పైన ఏసీబీ

రేవంత్ రెడ్డి తమ విచారణకు సహకరించడం లేదని ఏసీబీ, రేవంత్‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తరఫు లాయర్లు చెబుతున్నారు. కాగా, మూడో రోజైన సోమవారం రేవంత్‌ను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది.
రూ.5 కోట్లతో పాటు ఇంకేమైనా ఉందా? చంద్రబాబు ప్రస్తావించిన కమిట్మెంట్ ఏమిటి? అని అధికారులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. స్టీఫెన్‌కు ఇవ్వబోయిన రూ.50 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయన్న కోణంలో ప్రశ్నిస్తున్నారని సమాచారం. మిగతా నాలుగున్నర కోట్ల గురించి కూడా ఆరా తీస్తున్నారు.
కాల్ లిస్ట్ ఆధారంగా ఇంకా ఎంతమందికి ఆఫర్ చేశారన్న విషయమై ప్రశ్నిస్తోంది. చంద్రబాబు సంభాషణ ఆధారంగా రేవంత్, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఇంకా ఎవరెవరిని విచారించాలనే విషయమై కూడా యోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications