రేవంత్ రెడ్డి కేసు ఎఫెక్ట్: బలం ఉన్న చోటే టిడిపి, వైసిపి పోటీ
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి పట్టుబడిన ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికలపై పడినట్లే కనిపిస్తోంది.స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమకు బలం ఉన్న చోటే పోటీ దిగాలని నిర్ణయించుకున్నాయి.
తెలంగాణ ఎమ్మెల్సీ స్థానం కోసం నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయబోయి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. ఆ ఉచ్చులో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇరుక్కున్నారు. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి.

బలం ఉన్న చోటే పోటీకి దిగాలని తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశానికి ఉన్న సభ్యులు 458 మాత్రమే కాగా, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 28 మంది ఎక్కువగా 486 మంది ఉన్నారు. నిజానికి ఈ సభ్యులంతా కట్టుగా ఉండి ఓట్లు వేస్తే వారిది పైచేయి అవుతుంది.
అయితే ఈ జిల్లాలో ఉన్న 47 మంది ఇండిపెండెంట్ల ఓట్లు కీలకమవుతాయి. సహజంగా ఇండిపెండెంట్లు అధికార పార్టీకి అనుకూలంగా వేస్తారనేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముందుగానే అభ్యర్థని రంగంలోకి దింపడంపై ఆలోచనలో పడింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు కాల్వ శ్రీనివాసులు హర్షించారు. అయితే, బలం లేని కర్నూలులో టిడిపి ఎందుకు పోటీకి దిగిందనే విషయంపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications