ఏపీలో ఫలితాల తర్వాత ప్రతీకార దాడులు.. జూన్ 19వరకు అలెర్ట్ : ఇంటిలిజెన్స్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లోనూ, ప్రజలలోను ఆందోళనకు కారణంగా మారాయి. ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు మాత్రమే కాకుండా, ఆ తర్వాత కూడా వరుసగా దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతున్న ఈ దాడులు కట్టడి చేయడంలో పోలీస్ యంత్రాంగం విఫలమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దాడులు
ముఖ్యంగా తిరుపతి లోని చంద్రగిరి నియోజకవర్గంలోనూ, పల్నాడులోని మాచర్ల, గురజాల నియోజక వర్గాలలోను, తాడిపత్రి లోను జరుగుతున్న దాడుల పర్వం అంతా ఇంతా కాదు. ఇక నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ పర్సనల్ బాడీగార్డ్ పైన కూడా దాడి జరిగింది. రాష్ట్రంలో టిడిపి అధినేత చంద్రబాబుకు కూడా ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఆయనకు కేంద్రం భద్రతను మరింత పెంచింది.

చంద్రబాబుకు భద్రత పెంచిన కేంద్రం
గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భద్రత అధికారులు చంద్రబాబు నివాసం వద్ద ఆయన సంచరించే అన్ని ప్రదేశాలను పరిశీలించారు. చంద్రబాబు నాయుడుకి భద్రత పెంచాల్సిన అవసరాన్ని గుర్తించిన అధికారులు ఈ మేరకు చంద్రబాబు నివాసం వరకు 12 ×12 రెండు బ్యాచులు గా 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలను కేటాయించారు.
ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతీకార దాడులు
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర నిఘా వర్గం హెచ్చరిస్తోంది. జూన్ 19వ తేదీ వరకు పోలీస్ బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.
జిల్లా ఎస్పీలకు ఇంటిలిజెన్స్ హెచ్చరిక
ఏపీఎస్పీ బలగాలను పంపుతామని, అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతం కలగకుండా చూడాలని పేర్కొంది. ఈ మేరకు జిల్లా ఎస్పీలకు సందేశాన్ని కూడా పంపించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఇంటెలిజెన్స్ వర్గాలు, ఆయా ప్రాంతాలలో ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications