Pushpa -2: "పుష్ప -2" థియేటర్ల మూసివేత - ఫ్యాన్స్ ఫైర్..!!

మూడు రోజులుగా పుష్ఫ -2 సినిమా రికార్డులు మోత మోగిస్తోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ మూడ్ లో ఉన్నారు. ఓవర్సీస్ లోనూ మంచి వసూల్లు సాధిస్తోంది. ప్రీమియర్ షో లకు అనూహ్య స్పందన కనిపించింది. తొలి రోజే రూ. 294 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తున్న పుష్ఫ చిత్రం రానున్న రోజుల్లో కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో పుష్ఫ సినిమా ప్రదర్శి స్తున్న రెండు థియేటర్లను కుప్పంలో మూసివేయటం చర్చనీయాంశంగా మారింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. రష్మిక మందన్న నటించిన పుష్ప 2 చిత్రం హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల రచ్చ చేస్తోంది. బన్నీ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్న సమయంలో కుప్పం లో రెండు పుష్ఫ ప్రదర్శిస్తున్న సినిమా థియేటర్లను అధికారులు సీజ్ చేసారు. కుప్పంలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న లక్ష్మీ, మహాలక్ష్మీ థియేటర్లు సీజ్ అయ్యాయి. అర్ధాంతరంగా సినిమాను నిలిపివేసి మరీ థియేటర్‌కు తాళాలు వేశారు. ఈ రెండు థియేటర్లు టీడీపీ నేత కు చెందినవిగా చెబుతు న్నారు. సీజ్ చేయటం పైన అధికారులు కారణాలు వెల్లడిస్తున్నారు.

Revenue officials seized Two Pushpa movie running theaters in Kuppam due to Administrative reasons

సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు కావాల్సిన అనుమతి పత్రాలు లేవని అధికారులు పేర్కొ న్నారు. ఈ రెండు థియేటర్ల యాజమాన్యం లైసెన్సు రెన్యూవల్ చేయకపోవడం తో పాటుగా ఎన్‌ఓసీ లేకుండా ప్రదర్శనలు కొనసాగించటం చట్ట విరుద్దంగా వివరించారు. ఈ కారణంగానే చర్యలు తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే ధియేటర్ల విషయంలో కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. అయితే, పుష్ఫ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే అధికారులు ఈ రకంగా చర్యలు తీసుకోవటం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+