అల్లు అర్జున్ ఎక్కడకు వెళ్లాడు?
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'పుష్ప'. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఫేమస్ అవడమే కాకుండా సినిమాలోని కంటెంట్ వైరల్ గా మారింది. సినిమా తారల నుంచి సెలబ్రిటీల వరకు, రాజకీయాల నుంచి క్రీడారంగం వరకు సెలబ్రిటీలంతా 'పుష్ప' సినిమాలోని 'తగ్గేదేలే' డైలాగును వల్లెవేశారు. 'చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే' పాటలో అల్లు అర్జున్ కాలు ఈడ్చుకుంటూ చేసిన స్టెప్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీన్ని యువత అనుకరించడం మొదలుపెట్టింది.
సుకుమార్ ముదే చెప్పేశారు:'పుష్ప' పార్ట్2 ఉంటుందని ముందుగానే చెప్పేశారు. 'బాహుబలి'2 కోసం క్రియేటైన క్యూరియాసిటీ పుష్ప విషయంలో రిపీటవలేదు. 'పుష్ప వర్సెస్ భన్వర్ సింగ్ షెకావత్' గా సినిమా ఉండబోతోందని దర్శకుడు సుకుమార్ ముందే చెప్పేశారు. సినిమా క్లైమాక్స్ కూడా ప్రేక్షకులకు ఇంటర్వెల్ లా అనిపించింది. 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే' ప్రశ్న బాహుబలి2ని నిరంతరం ప్రజల్లో ఉంచింది. అలాంటి క్యూరియాసిటీనే ప్రజల్లో కలిగించాలనే ఉద్దేశంతోనే 'పుష్ప' దర్శకుడు సుకుమార్ ప్రత్యేకంగా ఒక టీజర్ ను రూపొందించి విడుదల చేశారు.

ఏమైంది? ఎక్కడకు వెళ్లాడు?:టీజర్ చూసిన తర్వాత 'పుష్ప' సెకండ్ పార్ట్ లో పుష్పకు ఏమైంది? ఎక్కడికి వెళ్లాడు? అనే ప్రశ్న అందరిలో ఉదయించింది. ఒకరకంగా దర్శకుడికి కావల్సింది కూడా ఇదే. టీజర్ చివర్లోనే అల్లు అర్జున్ కనపడినప్పటికీ అభిమానులు, ప్రేక్షుల్లో 'పుష్ప'కు ఏమైంది? ఎక్కడకు వెళ్లాడు? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీంతో సుకుమార్ ప్రణాళిక విజయవంతమైందని చెప్పవచ్చు. మైత్రీమూవీస్ పతాకంపై పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన పుష్ప మొదటి భాగం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విజయం సాధించింది. రెండో పార్ట్ కోసం అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications