ఏపీ నుంచి ప్రధాన ఎక్స్‌ప్రెస్ ప్రయాణ వేళలు మార్పు - వారణాసికి ప్రత్యేక రైళ్లు, రూట్...!!
రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో మార్పులు చేసారు. దసరా, దీపావళి రద్దీ వేళ ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణం గా ప్రత్యేక రైళ్ల ఏర్పాటు పైన కసరత్తు జరుగుతోంది. ఇక..మహబూబ్ నగర్ నుంచి వారణాసి, ప్రయాగ్ రాజ్ మీదుగా గోమ్టినగర్ కు ప్రత్యేక రైళ్లను అధికారులు ప్రకటించారు.
రేపల్లె-వికారాబాద్ మార్గంలో నడిచే డెల్టా ఎక్స్‌ప్రెస్ (17626) వేళలు నవంబరు 4నుంచి మర్పు పైన రైల్వే అధికారులు ప్రకటన చేసారు. ప్రస్తుతం రేపల్లె నుంచి ప్రతిరోజూ రాత్రి 10.40 గంటలకు బయల్దేరి సికింద్రాబాద్‌కు తర్వాతి రోజు ఉదయం 7.20గంటలకు చేరుకుంటోంది. కాగా, నవంబరు 4నుంచి వేళల్లో మార్పు కారణంగా ఈ రైలు సికింద్రాబాద్‌కు 45 నిమిషాలు ముందే(ఉదయం 6.35గంటలకు) రానుంది. అలాగే, వికారాబాద్‌కు ప్రస్తుతం చేరుకునే సమయం (9.40) కాగా, 20నిమిషాల ముందుగానే(9.20గంటలకు) రానుంది. రైల్వే శాఖ తాజా నిర్ణయంతో ప్రయాణ సమయం ఆదా కానుంది.

ఇక, పండగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం గోమ్టినగర్-మహబూబ్‌నగర్-గోమ్టినగర్ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 28 నుంచి నవంబరు 2వరకు ప్రతి సోమవారం గోమ్టినగర్-మహబూబ్‌నగర్ (05314) మధ్య 6 ప్రత్యేక రైళ్లు, ఈనెల 29 నుంచి నవంబరు 3 వరకు ప్రతి ఆదివారం మహబూబ్‌నగర్-గోమ్టినగర్ (05313) మధ్య 6 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపారు.
ఈ రైళ్లు వచ్చి వెళ్లేప్పుడు బారబంకి, బుర్హవాల్, గొండ బస్తీ, గోరక్‌పూర్, దోరియాసదర్, భట్ని, మౌ, ఔన్‌రిహర్, వారణాసి, మీర్జాపూర్, ప్రయాగ్‌రాజ్, మణిక్‌పూర్, సత్నా, కట్ని, జబల్‌పూర్, బాలఘాట్, గోండియా, బల్హార్షా, బెల్లంపల్లి, రామగుండం, కాజీపేట, మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల స్టేషన్‌లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.












Click it and Unblock the Notifications