చంద్రబాబుపై ఆర్జీవి సెటైర్లు : మగాడు పబ్లిక్ లో ఏడిస్తే జుగుప్స - నా మూవీ ట్రైలర్ చూసి ఏడ్చేసారు..!!
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబు బోరున ఏడ్చేసారు. ఆయన సభలో తాను ఇక ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటానని..తిరిగి సీఎం అయిన తరువాతనే సభలో అడుగు పెడతానంటూ బయటకు వెళ్లిపోయారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాజకీయాలతో సంబంధం లేని తన సతీమణి పైన అసభ్యంగా మాట్లాడారంటూ ఏడ్చేసారు. ఇది రాజకీయం గా కలకలం రేపింది. దీని పైన రకరకాల స్పందనలు వ్యక్తం అయ్యాయి. టీడీపీ శ్రేణులు వైసీపీ నేతల దిష్టిబొమ్మలు దగ్డం చేస్తూ నిరసనలకు దిగారు.
Recommended Video

చంద్రబాబు కన్నీరు..రాజకీయ కలకలం
వైసీసీ మంత్రులు..నేతలు చంద్రబాబు అంతా నాటకం అంటూ కౌంటర్ ఎటాక్ చేసారు. ముఖ్యమంత్రి జగన్ సైతం చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ ప్రస్తావించలేదని చెప్పుకొచ్చారు. ఇక, ఇదే సమయంలో ఈ అంశం పైన వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ స్పందించారు. దీని పైన ట్వీట్ చేసారు. అందులో..ఏడ్చే మగవాణ్ణి.. నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని పూర్వీకులు చెప్పారని నేను ఎప్పుడో విన్నాను..
కానీ, నేను నవ్వే ఆడదాన్ని ఇష్టపడతాను, ఎందుకంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి, కానీ బలం మరియు ధైర్యం చూపించాల్సిన మగాడు పబ్లిక్ లో ఏడిస్తే జాలి కాదు, జుగుప్స పుడుతుందని పేర్కొన్నారు. ఇక, మరో వీడియో ఒకటి తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్టు చేసారు.
రాం గోపాల్ వర్మ సెటైర్లు
చంద్రబాబు తాను రూపొందించిన "పవర్ స్టార్ ఆర్జీవీ మిస్సింగ్" ట్రైలర్ చూసే ఏడ్చేశారంటూ సైటైర్ వేసారు. చంద్రబాబు ఏడుస్తున్న క్లిప్‌ను కట్ చేసి, ఆయనే మాట్లాడుతున్నట్లుగా ఓ మిమిక్రీ వాయిస్‌ను జత చేశాడు. 'ఇందాకే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ చూడటం జరిగింది. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకేతై అర్థం కావడం లేదు' అని చంద్రబాబు చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా ఉంది.
దీనికి వర్మ.. 'ఇందాకే బాబు ట్రైలర్ చూశారు. ఆయన స్పందనకు ధన్యవాదాలు' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. ఎటువంటి సందర్భం పైన అయినా స్పందించే ఆర్జీవి..తన సినిమా ప్రమోషన్ కోసం ఏ అంశాన్ని అయినా వినియోగించుకోవటంలో ముందుంటారని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

సినిమా ట్రయిలర్ చూసి ఏడ్చేశారంటూ
ఆర్జీవి చేసిన పోస్టు పైన టీడీపీ శ్రేణులు రియాక్ట్ అవుతున్నారు. తన సినిమా ప్రమోషన్ కోసం ఇటువంటివి చేస్తున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక ఆర్జీవి మిస్సింగ్ చిత్రాన్ని భీమవరం టాకీస్ పతాకంపై ఛటర్జీ నిర్మిస్తున్నారు. అధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.ఇందులో పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, చిరంజీవి వంటి వారి పాత్రలను ఆర్జీవి సెటైరికల్‌గా చూపించారు. గతంలోనూ ఆయన ఆయన పొలిటికల్ గా సెటైరికల్ మూవీలు నిర్మించారు.












Click it and Unblock the Notifications