'అమ్మ' తరహా ఏపీలో అన్న క్యాంటీన్: రూ.5కు భోజనం
హైదరాబాద్: తమిళనాడులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్ల తరహాలో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అన్న క్యాంటీన్లు (ఎన్టీఆర్ క్యాంటీన్లు) ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్యాంటీన్లలో పేదలకు రూ.5కే భోజనం ఇవ్వనున్నారు.
పేద ప్రజల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్ల తరహాలో ఏపీలో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఎన్టీఆర్ క్యాంటీన్ల పేరుతో త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.

ఎన్టీఆర్ క్యాంటీన్ల ద్వారా రూ.5 కే పేదలకు రుచికరమైన భోజనం అందిస్తామన్నారు. ఈ నెల 8న అన్ని శాఖల మంత్రులతో సమావేశమై ఈ పథకానికి తుదిరూపు ఇస్తామన్నారు.
త్వరలోనే దీపం పథకం కింద మహిళలకు ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు పరిటాల సునీత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో పౌర సరఫరాల శాఖకు రూ.4 వేల కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరానని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications