న్యాయం చేయండి: రిషికేశ్వరి పేరెంట్స్, వదిలి పెట్టేది లేదు: గంటా
విజయవాడ: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోను వదిలి పెట్టేది లేదని మంద్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం విజయవాడలో అన్నారు. గంటాను రిషికేశ్వరి తల్లిదండ్రులు కలిశారు.
తమ కూతురు ఆత్మహత్యకు కారణమైన వారి పైన చర్యలు తీసుకోవాలని వారు ఆయనను కోరారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడారు. ఆత్మహత్యకు కారణమైన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రిషికేశ్వరికి న్యాయం చేయాలంటూ శుక్రవారం బంద్‌కు వైసీపీ పిలుపునిచ్చింది.
గురువారం నాడు రిషికేశ్వరి తల్లిదండ్రులు మాట్లాడుతూ... తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమన్నారు. తమ పోరాటం ర్యాగింగ్ పైనే అని చెప్పారు. మా అమ్మాయిలో మరొకరు బలి కావొద్దన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలన్నారు.

రిషికేశ్వరి మృతి కేసులో బాబురావును ఏ1గా చేర్చాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బాబురావు ఎదుర్కొంటున్న ఇతర అభియోగాల పైన కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో ముగ్గురు మహిళా అధ్యాపకులు అకారణంగా వర్సిటీ వదిలి ఎందుకు వెళ్లారో వెలికి తీయాలన్నారు.
బెయిల్ పైన పిటిషన్ 6కు వాయిదా
రిషికేశ్వరి మృతి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పైన విచారణను మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో శ్రీనివాస్, జయచరణ్, అనీషాలను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ముగ్గురు ప్రస్తుతం గుంటూరు సబ్ జైలులో ఉన్నారు.












Click it and Unblock the Notifications