టీడీపీ నాయకుడిని వెంటాడి చంపేసిన ప్రత్యర్థులు, ప్రభుత్వం మారినా తీరు మారలేదు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాము ధైర్యంగా తిరుగుతామని టీడీపీ కార్యకర్తలు అనుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తమను అనేక ఇబ్బందులకు గురి చేశారని, ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి రావడంతో మాకు ఎలాంటి సమస్యలు రావని టీడీపీ కార్యకర్తలు అనుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారి నెల రోజులు కూడా కాకుండానే టీడీపీ నాయకుడు దారుణ హత్యకు గురైనాడు.
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని మెచ్చిరి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆదెప్ప అలియాస్ ఆది (50) అనే వ్యక్తిని హత్య చేసి అతని గ్రామం సమీపంలోని పొలంలో శవం విసిరేయడం కలకలం రేపుతోంది. అయితే ఆదెప్పను కర్ణాటకలో హత్య చేసి శవాన్ని సొంత గ్రామంలో విసిరేశారని తెలిసింది. మెచ్చిరి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి, యాదవ సామాజిక వర్గాల మద్య గొడవలు జరుగుతున్నాయి.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలు, విబేధాలు మరింత ముదిరిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఓ వర్గం వాళ్లు ఇళ్లల్లో లేని సమయంలో మరో వర్గం వారు వారి ఇళ్లలో చొరబడి మహిళలను ఇష్టం వచ్చినట్లు చితకబాది వారిని రోడ్ల మీదకు లాగి దాడులు చేశారు. ఈ గొడవల కారణంగా ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గ్రామంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో అర్చకత్వంపై రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. చాలాకాలం పాటు ఈ గొడవలు జరగడంతో అర్చకులు కొందరు కోర్టుకు వెళ్లారు. సుమారు మూడు సంవత్సరాల పాటు వేరే వర్గం వాళ్లు ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చెయ్యడంతో రెండు వర్గాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. కోర్టులో అర్చకులకు అనుకూలంగా తీర్పు రావడంతో మరో వర్గం వారు రగిలిపోయారు. అయినప్పటికి వైసీపీ నాయకులు దాడులు మొదలుపెట్టడంతో ఆ అర్చకులు దేవాలయం వైపు వెళ్లడానికి భయపడిపోయారు.
ఆ సందర్బంలో అధికారంలో ఉన్న వైసీపీ నాయకుల ఒత్తిడితో టీడీపీకి అనుకూలంగా ఉన్న 16 మంది మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఆ గ్రామంలో కక్షలు మరింత ముదిరిపోయాయి. వైసీపీ నాయకుల మీద అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనేక ఆరోపణలు రావడంతో బెయిల్ వచ్చే సెక్షల కింద వైసీపీకి అనుకూలంగా ఉన్న కొందరి మీద పోలీసులు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అప్పటి నుంచి మెచ్చిరి గ్రామంలో నేటి వరకు పోలీసుల పికెట్ కొనసాగుతోంది. ఇటీవల సెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిపోవడంతో ఆ గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారడం, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఆదెప్ప తదితరులు రంగంలోకి దిగి ఆంజనేయస్వామి దేవాలయం తలుపులు తీయించి అర్చకులతో పూజలు చేయించడం మొదలుపెట్టారు.

ఈ విషయాన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఆంజనేయస్వామి దేవాలయంలో మళ్లీ పూజలు మొదలు కావడంతో ఆదెప్పతో పాటు టీడీపీ నాయకుల పెత్తనం మొదలైయ్యిందని వైసీపీ నాయకులు రగిలిపోయారని ఆరోపణలు ఉన్నాయి. సోమవారం ఆదెప్ప పనిపై బైక్ లో కర్ణాటకలోకి బళ్లారి జిల్లాలోని మొలకాల్మూర్ తాలుకాలోని పేదారగుడ్డం ప్రాంతానికి వెళ్లాడు.
అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆదెప్ప సొంత గ్రామంలో ఉన్న భార్యకు ఫోన్ చేసి మాట్లాడాడు. తరువాత గుర్తు తెలియని వ్యక్తులు ఆదెప్పను పట్టుకుని అతని కడుపు, చేతులు, కాళ్లు, తల మీద కత్తులతో దాడి చేసి చంపేసి అతని శవాన్ని ఆంధ్రప్రదేశ్ లోని అతని సొంత గ్రామం సమీపంలోని పొలాల్లో విసిరేసి వెళ్లిపోయారు. ఆదెప్ప శవం పడి ఉన్న ప్రాంతంలోనే ఆయన బైక్, చెప్పులు విసిరేసి వెళ్లారు.
మంగళవారం ఆదెప్ప హత్యకు గురైన విషయ వెలుగు చూడటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటకలో హత్య చేసి తరువాత ఆదెప్ప శవాన్ని ఆంధ్రప్రదేశ్ లోని ఆయన గ్రామం సమీపంలో విసిరేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. బుధవారం రాయదుర్గం యూపీఎస్ సీఐ శ్రీనివాసులు మెచ్చిరి గ్రామానికి చేరుకుని రెండు వర్గాల వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దింపారు.
-
సపోటా పండులో విషం పెట్టి రెండేళ్ళ కూతుర్ని చంపేసిన తండ్రి.. ఆపై -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications