జగన్ వచ్చినా జనం రాలేదని మంత్రి రోజాకు దిగులు, మేడమ్ కు క్లారిటీ వచ్చేసిందా ?
వైఎస్ఆర్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తనకు అండగా ఉన్నంతవరకు తన వెంట ఏనాయకుడు వచ్చినా, రాకపోయినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అనుకున్న మంత్రి ఆర్ కే రోజా ఇప్పుడు అయోమయంలో పడిపోయారు. సీఎం జగన్ బహిరంగ సభతో తాను కచ్చితంగా ఎమ్మెల్యే అయిపోతానని అనుకున్న రోజాకు మైండ్ బ్లాక్ అయ్యింది. సీఎం జగన్ బహిరంగ సభకు జనం అంతంతమాత్రంగానే రావడంగో నగిరిలో రోజాకు సినిమా కనపడుతుందని స్పష్టంగా వెలుగు చూసింది.
నగిరి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి మంత్రి రోజా మరోసారి పోటీ చేస్తున్నారు. నగిరి అసెంబ్లీ నియోజక వర్గంలోని ఐదు మండలాల్లోని ప్రముఖ వైసీపీ నాయకులు రోజా తీరుతో విసిగిపోయి ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చెయ్యడానికి నిరాకరించారు. చాలా మంది నాయకులు రోజాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకూడదని వైసీపీ అధిష్టానికి మనవి చేసినా రోజా మాత్రం మొండిపట్టుపట్టి ఎమ్మెల్యె టిక్కెట్ తెచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

రోజాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడంతో ఆమెను కచ్చితంగా ఓడిస్తామని వైసీపీ నాయకులు బహిరంగంగానే చెప్పారు. అయితే రోజాను ఎలాగైనా గెలిపించుకోవాలని అనుకున్న సీఎం జగన్ నగిరి నియోజక వర్గంలో బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అనుకున్నట్లే శుక్రవారం పుత్తూరులో సీఎం జగన్ బహిరంగ సభ జరిగింది. పుత్తూరు బహిరంగ సభకు నగిరి నియోజక వర్గంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వైసీపీ కార్యకర్తలను పుత్తూరు తరలించారు. జగన్ బహిరంగ సభ మీద రోజా చాలా ఆశలుపెట్టుకున్నారు.
అయితే చివరికి రోజా ఆశలు తస్సుమన్నాయి. సీఎం జగన్ ప్రసంగం వినడానికి జనం ఆసక్తిచూపించలేదని వెలుగు చూసింది. వైసీపీ నాయకుల ఒత్తిడితో బహిరంగ సభ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన ప్రజలు ఎండ దెబ్బకు వాహనాల్లోనే కుర్చున్నారని వెలుగు చూసింది. సీఎం జగన్ కోసం మాత్రమే పుత్తూరులో జరిగిన బహిరంగ సభకు హాజరు అయిన వైసీపీ నాయకులు రోజాకు మద్దతుగా పని చేస్తారని గ్యారెంటీ లేదని తెలిసింది.
సీఎం జగన్ బహిరంగ సభతో తనకు సుడి తిరుగుతుందని ఆశలు పెట్టుకున్న రోజాకు గుబులు మొదలైయ్యిందని తెలిసింది. సీఎం జగన్ వచ్చినా రోజా తీరుతో విసిగిపోయిన ప్రజలు, వైసీపీ కార్యర్తలు ఆయన బహిరంగ సభకు హాజరుకాలేదని, ఆయన మాట్లాడుతున్న సమయంలో చాలా మంది అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిసింది. నగిరి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి, మంత్రి రోజా విజయంపై సీఎం జగన్ కు కూడా అసలు మ్యాటర్ అర్థం అయిపోయిందని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.












Click it and Unblock the Notifications