చంద్రబాబు అండ్ కోతో ఆటకు ఏపీ రెడీ- హైదరాబాద్ తరిమేస్తారన్న రోజా..!
ఏపీలో వచ్చే ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా పొత్తులతో ముందుకొస్తున్న విపక్షాలపై అధికార పార్టీ కౌంటర్లు సంధిస్తోంది. ఇదే క్రమంలో మంత్రి ఆర్కే రోజా ఇవాళ విశాఖపట్నంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో టీడీపీ-జనసేన లక్ష్యంగా పంచ్ లు విసిరారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కోను రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
సింహం జింకను వేటాడే సమయంలో ఎలాగైతే ఫోకస్ చేస్తుందో అలానే మీరు కూడా ఆటపై దృష్టి పెట్టి విజయం సాధించాలని ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్‌లో క్రీడాకారులకు మంత్రి రోజా పిలుపునిచ్చారు. అలాగే చంద్రబాబు అండ్ కోను వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ప్రజలు సిద్దమవుతున్నారన్నారు. హైదరాబాద్ కు వారిని తరిమేసే వరకూ ప్రజలు విశ్రమించబోరన్నారు.
సింహం జింకను వేటాడే సమయంలో ఎలాగైతే ఫోకస్ చేస్తుందో అలానే మీరు కూడా ఆటపై దృష్టి పెట్టి విజయం సాధించాలి- ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్‌లో మంత్రి రోజా#MLARoja #RojaSelvamani #YSJagan #AdudhamAndhra #YSRCP #Oneindiatelugu pic.twitter.com/kqGmXfkNXb
— oneindiatelugu (@oneindiatelugu) February 9, 2024

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో 1.2 కోట్ల మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
డిసెంబర్ 26న మొదలైన ఈ టోర్నీ ఫైనల్స్ పోటీలు ఇవాళ్టి నుంచి విశాఖలో జరుగుతున్నాయి. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఫైనలిస్టులకు మంత్రి రోజా శుభాకాంక్షలు తెలిపారు. ఈ టోర్నీలో భారీగా బాలికలు పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రి వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వం కల్పిస్తున్న మహిళా సాధికారికతకు ఇదే నిదర్శనమన్నారు. మరోవైపు ఈ టోర్నీలో మొత్తం 26 జిల్లాల నుంచి 2964 మంది క్రీడాకారులు, 260 జట్లు ఫైనల్స్‌లో తలపడనున్నారు. ఈ మ్యాచ్‌లు ఈ నెల 13 వరకూ ఉంటాయి. 13వ తేదీన జరిగే టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరవుతారు.
చంద్రబాబు, పవన్‌లతో ఆడి గెలిచేందుకు ఆంధ్రా సిద్ధమవుతోంది - మంత్రి రోజా#MLARoja #RojaSelvamani #Chandrababu #PawanKalyan #YSJagan #AndhraPradesh #AdushamAndhra #Oneindiatelugu pic.twitter.com/FJunzgzUtz
— oneindiatelugu (@oneindiatelugu) February 9, 2024












Click it and Unblock the Notifications