పార్టీ ఓటమిపై రోజా కీలక వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ కీలక మహిళా నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రజలకు చంద్రబాబు నరకం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు , ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల పై అప్పులు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
అమలు చేయలేని హామీలిచ్చి చంద్రబాబు ఇప్పుడు వాటిని అమలు చేయకుండా సాకులు వెతుకుతున్నారని రోజా ఎద్దేవా చేశారు.చంద్రబాబు సీఎం అయిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని రోజా తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. ఆరు నెలల్లోనే ఆలీబాబా అరడజను దొంగల్లా మారారని కూటమి ప్రభుత్వం పై రోజా విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో వైసీపీపై కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న తీరుపై కూడా రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తోన్న కూటమి ప్రభుత్వానికి మేం అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని ఆమె హెచ్చరించారు. ఇదే సమయంలో పార్టీ ఓటమిపై రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ తప్పు చేసి ఓడిపోలేదని, కూటమి ప్రభుత్వ తప్పుడు ప్రచారం వల్లే ఓడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చింతంగా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని రోజా ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కుప్పం సహా 14 స్థానాలను కైవసం చేసుకుంటామని రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌ను ఎందుకు ఓడించామనే ప్రశ్చాత్తాపం ప్రజల్లో కనిపిస్తోందని రోజా వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలుస్తారని రోజా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications