చంద్రబాబు రాజకీయం అదే, టీడీపీ పాపంలో పవన్ కళ్యాణ్: రోజా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న క్రమంలో సీఎం చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.

వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వైసీపీ నాయకులపై దాడులు, ఇచ్చిన హామీలు నెరవేర్చ లేకపోయాడు చంద్రబాబు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చాడు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదు అని రోజా ధ్వజమెత్తారు.

RK Roja slams Chandrababu naidu s govt 100 days administration

చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదొకటి తెరపైకి తెచ్చి, పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారు. చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజలు ఖండిస్తున్నారు చీకొడుతున్నారు. టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థ, సిఎంకు ఎలాంటి సంబంధం ఉండదని మంత్రి లోకేష్ అంటున్నారు. జగన్ అనిమల్ ఫ్యాట్ మిక్స్ చేయించినట్లుగా చంద్రబాబు సృష్టిస్తున్నారు. చంద్రబాబు ఆరోపణలు సమంజసం కాదని రోజా వ్యాఖ్యానించారు.

ఈఓ శ్యామల రావు బాధ్యతలు తీసుకున్న వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నట్లు తెలిపారు. జూలై 23న వెజిటబుల్ ఆయిల్ మిక్స్ చేశారు.. అందుకే నెయ్యిని వెనక్కు పంపాం అంటూ ఈవో స్టేట్మెంట్ ఇచ్చారు. రెండు నెలల అనంతరం సీఎం స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నింద వేశారు. మళ్లీ శ్యామలరావుపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టించారు అని రోజా ఆరోపించారు.

మీ ప్రభుత్వంలో బయటపడిన అంశం కాబట్టి బాధ్యులు ఎవరు? సీఎం చంద్రబాబునా? ఈవో శ్యామలరావు ఆ...?? జగన్ అధికారంలో ఉన్న సమయంలో పీఎం మోడీ, సీజేఐలు, చంద్రబాబు సైతం ఫ్యామిలీతో రావడం జరిగింది. లడ్డూ రుచిలో తేడా ఉంటే ఆ రోజే కంప్లైంట్ ఇవ్వాలి కదా! ఐదేళ్లలో ఏదో జరిగిందని నింద వేయడానికి కల్తీ నెయ్యి అంటూ ప్రచారం చేస్తున్నారు అని రోజా మండిపడ్డారు.

టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? బీజేపీ నాయకులు సైతం గత పాలక మండలిలో ఉన్నారు... అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ప్రస్తుతం టీడీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి, పార్థసారథి గత పాలకమండలిలో ఉన్నారు... తప్పు చేశారా లేదా వాళ్లైనా చెప్పాలి! ఈరోజు ప్రాయిశ్చిత దీక్ష చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రాయిశ్చిత్తం ఎవరు చేస్తారు? తప్పుచేసినవారు చేస్తారు అంటే ప్రభుత్వం లో ఉన్నాము టీడీపీ పాపంలో భాగం ఉందికనుక దీక్షచేస్తున్నానని ఆయనే ఒప్పుకున్నారు అని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+