బ్రిడ్జి పైనుంచి పడిన బస్సు: 45మందికి గాయాలు, ముగ్గురికి తీవ్రగాయాలు
కడప జిల్లాలోని పోరుమామిళ్ల మండలం వంకమర్రి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. సగిలేరు వంతెనపై నుంచి ఇందూ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈప్రమాదంలో 45మందికి గాయాలయ్యాయి.
కడప: జిల్లాలోని పోరుమామిళ్ల మండలం వంకమర్రి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. సగిలేరు వంతెనపై నుంచి ఇందూ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈప్రమాదంలో 45మందికి గాయాలయ్యాయి.
బస్సు వేంపల్లి నుంచి గుడివాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి 11గంటల ప్రాంతంలో మైదుకూరు-పోరుమామిళ్ల రహదారిపై వంకమర్రి వంతెన వద్ద బస్సు అదుపుతప్పి పది అడుగుల వాలులో పడిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులు కిటికీ అద్దాలు బద్దలు కొట్టుకుని బయటపడ్డారు. ఆపై 108కి సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పోరుమామిళ్ల ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.












Click it and Unblock the Notifications