అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘోర ప్రమాదం: బస్సు లోయలోపడి 17మంది మృతి

|
Google Oneindia TeluguNews

అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ-మడకశిర మార్గంలో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా 17 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 24 మందికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బస్సులో మొత్తం 84 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. మృతుల్లో 9 మంది విద్యార్తులున్నారు.

బస్సు మడకశిర నుంచి పెనుకొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను తప్పించబోయి బస్సు లోయలో పడినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్గాయం కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్ర మంత్రులు, అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు నెంబర్ ఏపి 28 జడ్ 1053.

కాగా, బస్సు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బస్సు 60 అడుగుల లోతులో పడింది. బస్సు పూర్తిగా తుక్కుతుక్కు అయింది. బ్రతికి బయపడినవారిది అదృష్టమే తప్ప మరేమీ కాదు, అంత ఘోరంగా బస్సు ప్రమాదం ఉంది. ఆటోను తప్పించబోవడంతో అదుపు బస్సు లోయలో పడినట్లు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Road accident: 8 persons died, 10 injured

మతిస్థిమితం లేని వ్యక్తి దారుణ హత్య

సిద్ధయ్యగుట్టకు చెందిన మతిస్థిమితం సరిగా లేని రాజు (32) దారుణ హత్యకు గురయ్యాడు. రాజును గుర్తుతెలియని వ్యక్తులు స్థానిక హౌసింగ్ కార్యాలయం వెనుక భాగాన గల కంపచెట్లలో రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. అయితే ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

విషయం తెలుసుకున్న పట్టణ, రూరల్ సిఐలు విజయభాస్కర్‌గౌడ్, మురళీకృష్ణ, ఎస్‌ఐలు హమీద్‌ఖాన్, మధుప్రసాద్‌లు సిబ్బందితో సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

ఇది ఇలా ఉండగా ధర్మవరం మండల పరిధిలోని మల్లేనిపల్లి గ్రామానికి చెందిన నాగభూషణం (45) సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగభూషణం పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా వెంటనే 108 వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

English summary
14 persons died and 30 injured in a road accident occurred at Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X