ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు దర్మరణం

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు దుర్మరణం చెందారు. గుర్తు తెలియని వాహనం.. బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. విశాఖ నగరంలోని పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం సమీపంలో వీ కన్వెన్షన్‌ హాల్‌ ఎదురుగా మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి మారికవలసలోని శారదానగర్-2 ప్రాంతానికి చెందిన ధనరాజ్.. స్వతంతర్ నగర్‌కు చెందిన కే వినోద్ ఖన్నా కలిసి లా కాలేజీ సమంలోని పనోరమ హిల్స్‌లో ఉన్న స్నేహితుడు ప్రశాంత్ పుట్టిన రోజు వేడుకలకి చేరుకున్నారు. కొద్దిసేపు అక్కడే గడిపిన తర్వాత బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు కొమ్మాది పెట్రోల్ బంక్‌కు వెళ్లారు.

 Road accident in Visakhapatnam: Two Techies killed

పెట్రోల్ పోయించుకున్న తర్వాత అక్కడ్నుంచి తిరిగి పనోరమ హిల్స్‌కు వెళ్లేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో స్టేడియం వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం వాళ్ల బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ధనరాజ్(22), వినోద్ ఖన్నా(22) అక్కడికక్కడే మృతి చెందారు. ధనరాజ్ ఇన్పోసిస్‌లో, వినోద్ ఖన్నా స్థానికంగానే రామాటాకీస్ వద్ద ఓ ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు.

ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చేతికందిన ఇద్దరు యువకులు మరణించడంతో మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇద్దరు యువకుల మృతితో మారికవలసలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నాగుల చవితి వేడుకలో అపశృతి

విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి పరిదిలోని పాత వీధిలో జరిగిన నాగుల చవితి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నాగుల చవితి రోజున సంతోష్ అనే వ్యక్తి నోట్లో డీజిల్ పోసుకుని మంటలు ఊదుతూ విన్యాసం చేస్తుండగా అతడికి మంటలు అంటుకున్నాయి. వెంటనే మంటలు ఆర్పేందుకు అక్కడున్నవారు ప్రయత్నించారు.

అయినప్పటికీ మంటలు తగ్గకపోవడంతో సంతోష్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ముఖం, ఛాతి భాగాలకు మంటలు అంటుకున్నాయి. అక్కడున్న మరికొంత మంది నీళ్లుపోసి మంటలు ఆర్పివేశారు. అప్పటికే సంతోష్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+