వ్యాన్‌ను ఢీకొన్న కారు: ముగ్గురి మృతి
చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి మండలంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిలోని మామండూరు-నడింపల్లి గ్రామాల మధ్య పాల వ్యాన్‌ను వేగంగా దూసుకొచ్చి కారు ఢీకొంది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ సహా మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతి నుంచి చిత్తూరు వెళ్తున్న పాలవ్యాన్‌ను ఎదురుగా వస్తున్న కారు వేరే వాహనాన్ని అధిగమించే క్రమంలో బలంగా ఢీకొట్టింది.
దీంతో కారు ముందు భాగం వ్యాన్‌లోకి చొచ్చుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురూ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో కారును వెలికితీశారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications