జగన్ పార్టీ ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన లారీ: గాయాలు, ఆస్పత్రిలో చేరిక
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి శనివారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి శనివారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రసాద్ రెడ్డి కుటుంబ సమేతంగా పులివెందుల మీదుగా బెంగళూరుకు వెళుతుండగా నామాలగుండు సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.

సమాచారం అందుకున్న పులివెందుల పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన కుటుంబసభ్యులను పులివెందులలోని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం రాచమల్లు తన కుటుంబంతో బెంగళూరు పయనమయ్యారు.












Click it and Unblock the Notifications