చంద్రబాబు 'చాయ్ పే చర్చా'... లోకేష్ 'కాఫీ పే చర్చా'?

తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్ శర్మ నియమితులైన తర్వాత పార్టీ ప్రచార సరళిని పూర్తిగా మార్చేశారు. అధినేత చంద్రబాబునాయుడు గతంలో ఎక్కడ పర్యటించినా ఓపెన్ టాప్ జీపుపై ప్రసంగించేవారు. దారిపొడవునా ప్రజలుంటే అక్కడక్కడ ఆగుతూ ప్రసంగించేవారు. కానీ రానున్న ఎన్నికల్లో గెలుపు ఒక్కటే ఆప్షన్ గా ఉండటంతో పార్టీ విధివిధానాలు మార్చకపోయినప్పటికీ చంద్రబాబు మాత్రం మారుతున్నారు.

అప్పికట్లలో చాయ్ పే చర్చా

అప్పికట్లలో చాయ్ పే చర్చా


బాపట్ల జిల్లాలో పర్యటించిన సమయంలో చంద్రబాబు చాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహించారు. నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసుకునే సమయంలో ప్రశాంత్ కిషోర్ కూడా ఈ తరహా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రాబిన్ శర్మ ఆయన శిష్యుడే కావడంతో అదే తరహా ప్రచార సరళిని రూపొందిస్తున్నారు. అప్పికట్లలో రోడ్డు పక్కనే ఉన్న ఒక టీ కొట్టుకు వెళ్లిన చంద్రబాబు సామాన్యుడిలా టీ తాగారు. అంతేకాదు వారితో మాటామంతీ కలిపారు. కొంతమంది స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తన ప్రచార సరళిని అనూహ్యంగా మార్చిన చంద్రబాబును చూసి తెలుగు తమ్ముళ్లు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. అంతేకాకుండా బాబు ఎక్కడ పర్యటించినా ప్రజలు భారీసంఖ్యలో తరలిరావడం కూడా వారిలో ఉత్సాహాన్ని నింపుతోంది.

రానున్న రోజుల్లో ఈ తరహా ప్రచారమే..

రానున్న రోజుల్లో ఈ తరహా ప్రచారమే..


ఎన్నికలకు ఎక్కువగా సమయం కూడా లేకపోవడంతో ఈ తరహా కార్యక్రమాలతో, ఈ తరహా ప్రచార సరళితో ప్రజల్లోకి సులువుగా వెళ్లగలమని అధినేతకు అర్థమైంది. రానున్న రోజుల్లో ఈ తరహా ప్రచార సరళే ఉండబోతోందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఎక్కడకు వెళ్లినా అది టీ కొట్టైనా, బడ్డీ కొట్టైనా వారితో కలిసిపోవడం, వారితో మాట్లాడం, వారి కష్టసుఖాలు తెలుసుకోవడం, వారిని ఆప్యాయంగా మాట్లాడించడం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇది విజయవంతమైన నేపథ్యంలో మరిన్ని కార్యక్రమాలను పార్టీ రూపొందించబోతోంది.

లోకేష్ పాదయాత్రకు కూడా ఇలాగే..

లోకేష్ పాదయాత్రకు కూడా ఇలాగే..


చంద్రబాబు తనయుడు లోకేష్ నిర్వహించబోయే పాదయాత్రలో ఈ తరహా విధానాలనే అవలంబిచబోతున్నారు. జగన్ జరిపిన ఓదార్పు యాత్ర కూడా ఈ కోవలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరిని దగ్గరకు తీసుకున్న జగన్ వారిలో తాను ఒకణ్ని అని నమ్మకాన్ని కల్పించడంలో సఫలమయ్యారు. ప్రజల్లో ఆ భావన కలిగిన నాడు గెలుపు సులభమవుతుందని జగన్ కు తెలుసు. అందుకే ఇప్పుడు అదే విధానాన్ని చంద్రబాబు కూడా అవలంబించబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+