వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దుపై ఊగిపోయిన రోజా: హెరిటేజ్ టు బిగ్ బజార్.. బాబుపై సంచలన ఆరోపణ

నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపైనగరి ఎమ్మెల్యే రోజా బుధవారం నాడు కేంద్రం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో చంద్రబాబు బిగ్ బజార్‌లో షేర్లు కొన్నారని ఆరోపణలు చేశారు.

|
Google Oneindia TeluguNews

ఏలూరు: నోట్ల రద్దు, తదనంతర పరిణామాల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం నాడు కేంద్రం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో చంద్రబాబు బిగ్ బజార్‌లో షేర్లు కొన్నారని సంచలన ఆరోపణలు చేశారు.

ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఓ బట్టల దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దేశంలో వంద శాతం అక్షరాస్యత లేనప్పుడు వంద శాతం డిజిటలైజేషన్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

Roja alleges Chandrababu buys shares in Big Bazaar

ఏపీలో 12వేల గ్రామాలు ఉంటే అందులో తొమ్మిది వేల గ్రామాలలో ఇప్పటికీ బ్యాంకుల బ్రాంచులు లేవని చెప్పారు. వంద శాతం లిటరసీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకు రావాలని, అంతేకానీ ఆయన పబ్లిసిటీ కోసం హడావుడి చేస్తూ, ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

అభివృద్ధి చెందిన దేశాల్లోనే క్యాష్ లెస్ విధానం పూర్తిగా విజయవంతం కాలేదన్నారు. కేంద్రానికి ముందుచూపు లేకపోవడం వల్ల ప్రజలకు కరెన్సీ కష్టాలు, చిల్లర కష్టాలు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు తన హెరిటేజ్‌లో షేర్లు అమ్మి బిగ్ బజార్‌లో కొన్నారని సంచలన ఆరోపణ చేశారు. అందుకే చిల్లర కోసం బిగ్ బజార్ వెళ్లమంటున్నారని ఆరోపించారు.

ఆ దెబ్బకి యూటర్న్, డైలమా: కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ షాక్!ఆ దెబ్బకి యూటర్న్, డైలమా: కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ షాక్!

ఇదిలా ఉండగా, గురువారం ఉదయం పదిన్నర గంటలకు మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్షా సమావేసానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు హాజరు కానున్నారు. ఆరు నెలల్లోని వృద్ధిరేటు, నోట్ల రద్దు, కేంద్రంలో పెండింగ్ సమస్యల పైన చర్చించనున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ అజెండాతో ఈ నెల 21, 22న కలెక్టర్ల సదస్సు ఉంటుందన్నారు.

English summary
YSR Congress Party MLA Roja alleges Chandrababu buys shares in Big Bazaar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X