పీక్ స్టేజ్‌కి బాబు ప్రస్టేషన్, భూమా గురించి ఏం చెప్పావ్, దమ్ముందా: రోజా

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్టేషన్ పీక్ స్టేజ్‌కు చేరుకుందని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా సోమవారం ఎద్దేవా చేశారు. ఆ కారణంగానే ఓటమి భయంతో చంద్రబాబు శిల్పా మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు

నంద్యాల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్టేషన్ పీక్ స్టేజ్‌కు చేరుకుందని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా సోమవారం ఎద్దేవా చేశారు. ఆ కారణంగానే ఓటమి భయంతో చంద్రబాబు శిల్పా మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారని విమర్శించారు.

శిల్పాపై ఇప్పుడు విమర్శలా

శిల్పాపై ఇప్పుడు విమర్శలా

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నిన్నటి వరకు శిల్పా మోహన్ రెడ్డి మంచివాడుగా కనిపించారని, ఇప్పుడు టిడిపి నుంచి వైసిపిలో చేరగానే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

Recommended Video

    Nandyal By Polls : Bonda Uma ready to shave his head if TDP lost | Oneindia Telugu
    భూమా నాగిరెడ్డిని అప్పుడేమన్నావ్

    భూమా నాగిరెడ్డిని అప్పుడేమన్నావ్

    గతంలో భూమా నాగిరెడ్డిని విషవృక్షం అని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు అదే వ్యక్తిని పొగుడుతున్నారని రోజా గుర్తు చేశారు. పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచినప్పుడు ఇలాగే ఎన్టీఆర్‌ను విమర్శించారని, ఆ తర్వాత పొగుడుతున్నారన్నారు.

    చంద్రబాబు మాట్లాడటమా?

    చంద్రబాబు మాట్లాడటమా?

    మైనార్టీల అభివృద్ధి గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మైనార్టీలకు వైయస్ రాజశేఖర రెడ్డి మూడు మంత్రి పదవులు ఇచ్చారని, చంద్రబాబు మాత్రం ఇవ్వలేకపోయారన్నారు. ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు.

    చంద్రబాబుకు దమ్ముందా

    చంద్రబాబుకు దమ్ముందా

    మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అందించిన ఘనత వైయస్ రాజశేఖర రెడ్డిది అన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ అందించిన ఏకైక సీఎం కూడా వైయస్ అన్నారు. సాయం చేసిన వైయస్సార్‌ను మైనార్టీలు మరిచిపోరన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+