ఈ ఇద్ద‌రూ క‌లిస్తే టిడిపి లో ఒక్క‌రూ మిగ‌ల‌రు : పుల్వామా ను బాబు స‌మ‌ర్ధిస్తున్నారు : రోజా ఫైర్..!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై వైసిపి ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. వైసీపీ అధినేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు కలిసి కుట్రలు చేస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారని... వీరిద్దరూ కలిసి కుట్ర చేస్తే టీడీపీలో ఒక్క నాయకుడు కూడా మిగలరని అన్నారు. పుల్వామా ఘ‌ట‌న ను చంద్ర‌బాబు స‌మర్ధిస్తున్నార‌ని దుయ్య బ‌ట్టారు.

పుల్వామా పై బాబు వైఖ‌రి ఇదేనా..
పుల్వామా ఉగ్రదాడిని దేశమంతా ఖండిస్తుంటే.. సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఈ ఘటనను ఎందుకు సమర్థి స్తున్నారంటూ రోజా మండిపడ్డారు గతంలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్ కారణంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్‌ ఉగ్రవాదుల చర్యకు ఇప్పుడు ప్రధాని మోదీని రాజీనామా చేయమంటున్న బాబు... ఆనాడు 30 మంది ప్రాణాలు బలిగొని తానెందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. చం ద్రబాబు మీటింగ్ కోసం ఓ రైతును దారుణంగా కొట్టి చంపారని .. కనీసం ఇప్పుడైనా ఎందుకు రాజీనామా చేయడం లేదని ధ్వజమెత్తారు. దళితుల గురించి ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలు.. చంద్రబాబు తీరును బయటపెడుతున్నాయన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయనను అనుసరిస్తున్నారంటూ రోజా సీయం పై ఫైర్ అయ్యారు.

Roja fire on Chandrababu over Pulwama issue : supported Modi..

ఆ ఇద్ద‌రూ క‌లిస్తే ఒక్క‌రూ మిగ‌ల‌రు..!
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రజా బలాన్ని చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలోకి వలస వస్తున్నారని రోజా వివరించారు. అలా వచ్చే ప్రతీ ఒక్కరు తమ పదవులకు రాజీనామా చేయడం వైఎస్‌ జగన్‌ నైతికతకు నిదర్శన మని పేర్కొన్నారు. చంద్రబాబు మాత్రం వైఎస్సార్‌ సీపీ నుంచి కొన్న వారి చేత రాజీనామా చేయించకుండా దిగజారు డు రాజకీయాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. వైసీపీ అధినేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు కలిసి కుట్రలు చేస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారని... వీరిద్దరూ కలిసి కుట్ర చేస్తే టీడీపీలో ఒక్క నాయకుడు కూడా మిగలరని వైసిపి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+