గుర్తుంచుకోవాలని చంద్రబాబుకు రోజా చురకలు, జ్యూట్ బ్యాగ్‌లో బడ్జెట్ పత్రాలు

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు రోజా గురువారం నాడు శాసన సభలో అధికార పార్టీ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విపక్షాలు సంధిస్తున్న దాదాపు అన్ని ప్రశ్నలకు అచ్చెన్నాయుడు సమాధానం చెప్పడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

గృహ నిర్మాణ అంశం పైన సంబంధిత మంత్రిని మాట్లాడనివ్వకుండా ప్రతి దానికి ఆయన జోక్యం చేసుకుంటున్నారన్నారు. మరెవరికీ బుర్ర లేదన్నట్లుగా ప్రతి దానికి ఆయనే మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. నోరుంది కదా అని ఆయనకు మైక్ ఇస్తున్నట్లుగా ఉందన్నారు.

Roja lashes out at Chandrababu and TDP

తమను పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ అని విమర్శించే బదులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదట తాను ఎక్కడి నుండి వచ్చాడో తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు అమ్మమ్మ కాంగ్రెస్ నుండి వచ్చిన విషయం మరిచారా అన్నారు.

బడ్జెట్ పత్రాలను జ్యూట్ బ్యాగ్‌లో తెచ్చిన యనమల

ఏపీ శాసన సభలో గురువారం మధ్యాహ్నం పన్నెండుపావుకు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ పత్రాలను ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు జ్యూట్ బ్యాగ్‌లో అసెంబ్లీకి తీసుకు వచ్చారు. పర్యావరణ పరిరక్షణ, జ్యూట్ బ్యాగులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో తాను ఇలా తీసుకు వచ్చానని యనమల తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+