Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుజాతపై ఫైర్.. రోజాకి షాకిచ్చిన గ్రామస్థులు, జగన్! అడ్డుకోకు: పెట్టుబడులపై డొక్కా

ఏలూరు/విశాఖ: మంత్రి పీతల సుజాత పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సోమవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. సుజాతకు వడ్డాణాలు, డబ్బుల పైన ఉన్న ఆసక్తి ప్రజా సమస్యల పైన లేదని ఎద్దేవా చేశరు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చేది వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డియే అన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కరువు దాపరిస్తోందని విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రతి ఇళ్లు సౌభాగ్యంగా ఉండేదన్నారు. చంద్రబాబు హయాంలో దౌర్భాగ్యం ఉందని దుయ్యబట్టారు. సుజాతకు చంద్రబాబు భజన తప్ప ఇంకొకటి తెలియదన్నారు.

Roja lashes out at Sujatha, Dokka suggests YS Jagan

రోజాను అడ్డుకున్న టిడిపి కార్యకర్తలు

సోమవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో వైసిపి ఎమ్మెల్యే రోజా తలపెట్టిన పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసిపి మండల కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఆమె రాగా.. ఓ దళిత మంత్రిని అవమానపరిచేలా మాట్లాడిన ఆమె క్షమాపణ చెప్పాలని టిడిపి కార్యకర్తలు ధర్నాకు దిగారు.

చింతలపూడిలోకి రోజాను అనుమతించేది లేదని రాస్తారోకో చేశారు. రోజా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో వైసిపి శ్రేణులు కూడా రోడ్డు పైకి రావడంతో వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.

జగన్ అభివృద్ధిని అడ్డుకోకు: డొక్కా

ఏపీలో పెట్టుబడులకు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రావు గుంటూరులో అన్నారు. విశాఖ సీఐఐ సదస్సులో ఏపీకి పెట్టుబడులు వరదలా వచ్చి పడుతున్నాయని, అది చంద్రబాబు సమర్థతకు నిదర్శనం అన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధికి జగన్ సహకరించాల్సింది పోయి దుష్ప్రచారం చేయడం తగదన్నారు. అభివృద్ధికి సహకరించకపోయినా అడ్డు తగలొద్దన్నారు.

పెట్టుబడులకు ఏపీ అనుకూలంగా మార్చేందుకు బాబు కృషి: జిఎంఆర్

ఏపీని పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని జిఎంఆర్ ఛైర్మన్‌ గ్రంథి మల్లిఖార్జున రావు అన్నారు. సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్ - విజన్‌ 2029 అంశంపై చర్చల్లో పాల్గొని ప్రసంగించారు. 2029 నాటికి ఏపీని దేశంలో అగ్రస్థానంలో నిలపాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+