నగిరిలో మొదలైన ఆ లీడర్ హంగామా, రోజా ఫుల్ సైలెంట్ కావడంతో డౌట్ వచ్చేసిందా ??
ఆంధ్రప్రదేశ్ మంత్రి, సినీనటి ఆర్ కే రోజా పోటీ చేసిన నగిరి అసెంబ్లీ నియోజక వర్గం మరోసారి వార్తల్లో నిలిచింది. రోజా పేరు చెబితే టక్కున ఆమె సొంత నియోజక వర్గం నగిరి పేరు చెబుతుంటారు. నగిరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే అయిన ఆర్ కే రోజా తరువాత మంత్రి కూడా అయ్యారు. ప్రతిపక్ష నాయకులపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసి వారిని విమర్శించే రోజా నిత్యం వార్తల్లో ఉండటంతో నగిరి పేరు వార్తల్లో నిలిచింది.
అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించిన తరువాత ఆర్ కే రోజా గెలుపుకు మేము సహకరించము అని నగిరి నియోజకవర్గం లోని ఐదు మండలాల్లోని ప్రముఖ వైసీపీ నాయకులు కుండలుబద్దలు కొట్టినట్లు చెప్పిన సమయంలో కూడా రోజా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సొంతపార్టీ వైసీపీలోని రెబల్ నాయకులతో రాజీ కావడానికి రోజా ఏమాత్రం ప్రయత్నించలేదని తెలిసింది. నగిరిలో తాను మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రోజా ధీమా వ్యక్తం చేశారు.

అయితే ఎన్నికల పోలింగ్ కు రెండుమూడు రోజుల ముందు నుంచి రోజా సైలెంట్ అయిపోయారు. పోలింగ్ రోజు మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తన గెలుపుకంటే తన ఓటమికే కొందరు వైసీపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేశారని పోలింగ్ రోజు అంటే మే 13వ తేదీన మద్యాహ్నం రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా మీద పోటీ చేసిన టీడీపీ నాయకుడు గాలి భానుప్రకాష్ విజయం తనదే అంటూ మంచి ఊపుమీద ఉన్నారు.
ఇప్పుడు నగిరి టీడీపీ అభ్యర్థిని టార్గెట్ చేస్తూ కొందరు వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నా మంత్రి రోజా మంత్రి సైలెంట్ గా ఉండటం హాట్ టాపిక్ అయ్యింది. నగిరి అసెంబ్లీ నియోజక వర్గంలోని పుత్తూరు మునిసిపాలిటి పరిధిలోని చింతలగుంట ప్రాంతంలో గతంలో బీఎస్ జిమ్ సెంటర్ నిర్వహించేవారు. అయితే అనేక కారణాలతో కొంతకాలంగా జిమ్ సెంటర్ మూతపడింది. జిమ్ సెంటర్ నిర్వహకుడు హరి కూడా ఆ జిమ్ గురించి పట్టించుకోవడం మానేశాడు.
ఇటీవల అదే జిమ్ సెంటర్ ను బ్యాడ్మింటన్ కోర్టుగా తయారు చేశారు. నగిరి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ అదే బ్యాడ్మింటన్ కోర్డును ప్రారంభించారు. బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభోత్సవం సందర్బంగా పుత్తూరులో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యే అంటూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నిర్వహకులు ఆయనకు స్వాగతం పలికి బ్యాడ్మింటన్ కోర్టును గాలి భానుప్రకాష్ చేతుల మీదుగా ప్రారంభించారు.

వాస్తవానికి నగిరి ఎమ్మెల్యే రోజా, ఆమె ప్రస్తతం మంత్రి హోదాలోనే ఉన్నారు. అయితే నగిరిలో రోజా ఓడిపోతారని దాదాపు అన్ని సర్వేలు చెప్పడం, ఆమెకు చాలా మంది వైసీపీ నాయకులు దూరం కావడంతో నగిరికి కాబోయే ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే కౌంటింగ్ పూర్తి కాకుండా నగిరి ఎమ్మెల్యే అంటూ భానుప్రకాష్ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు నగిరి నియోజక వర్గంలో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.
పుత్తూరులో ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రోజా మాత్రం ఏమాత్రం విమర్శలు చెయ్యకుండా సైలెంట్ గా ఉండిపోవడంతో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు తాను సైలెంట్ గా ఉంటే మంచిది అని రోజా భావించిఉంటారని, అందుకే ఈ విషయంలో ఆమె ఏమాత్రం మాట్లాడటం లేదని పుత్తూరులో చర్చ జరుగుతోంది. అయితే వైసీపీలోని కొందరు నాయకులు, కార్యకర్తలు మాత్రం గాలి భానుప్రకాష్ మీద విమర్శలు చెయ్యడం మొదలుపెట్టారు.












Click it and Unblock the Notifications