టీటీడీ గోశాలలో చనిపోయిన గోవుల లెక్కలు..!!

మాజీ మంత్రి రోజా ప్రభుత్వం పైన మండిపడ్డారు. టీటీడీలో ఆవుల మరణాల పైన రాజకీయ రచ్చ సాగుతున్న వేళ గత ఏడాది కాలంలో గోశాలలో ప్రతీ నెలా ఎన్ని ఆవులు మరణించాయో లెక్కలతో సహా గోశాల అధికారులు వెల్లడించిన జాబితాను బయట పెట్టారు. వైసీపీ నేత భూమన గోవుల మర ణాల పైన చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా వివాదం మొదలైంది. టీడీపీ - వైసీపీ సవాళ్లతో ఈ రోజు తిరుపతిలో హైడ్రామా చోటు చేసుకుంది. అయితే, కూటమి నేతలు ఆవుల మరణాలు లేవని చెబు తుంటే.. ఇప్పుడు బయటకు వచ్చిన ఆవుల మరణాల లిస్టు సంచలనంగా మారుతోంది.

భూమన వ్యాఖ్యలతో
వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర రెడ్డి టీటీడీ గోశాలలో ఆవుల మరణాల పైన చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. తొలుత టీటీడీ ఈ వ్యాఖ్యలను ఖండించింది. కాగా, భూమన తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసారు. దీంతో, టీటీడీ గోశాల మరణాలపై చర్చ‌కు సిద్ధ‌మా అంటూ భూమ‌నకి ఎక్స్‌ వేదికగా టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస్‌ ఛాలెంజ్ చేసారు. సవాలును స్వీక‌రించిన మాజీ టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ‌ ఉదయం 10 గంటలకు గోశాలకు బయలుదేరే ప్రయత్నం చేసారు. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు గోశాల వద్దకు రావాలంటూ భూమనకు ఫోన్లు చేసారు.

roja-reveals-cows-death-list-in-ttd-gosala-amid-latest-political-row

భూమన నిరసన
భూమన గోశాలకు వెళ్లేందుకు పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని పోలీసులు స్ఫష్టం చేసారు. తమను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు మీద పడుకొని నిరసన వ్యక్తం చేసారు. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు భూమను ఫోన్ చేసి గోశాల వద్దకు రావాలని కోరారు. భూమనకు ఎస్కార్ట్ ఇస్తామని చెప్పుకొచ్చారు. తాను రావటానికి సిద్దంగా ఉన్నానని భూమన పేర్కొన్నారు. అయితే, భూమన వద్దకు వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అటు టీడీపీ నేతలు రావాలని పిలవటం.. ఇటు పోలీసులు తమను అడ్డుకుంటున్నారంటూ భూమన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో మాజీ మంత్రి రోజా టీడీపీ నేతల పైన మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస్ సవాల్‌కు భూమన సిద్ధమయ్యార‌ని, గోశాల వద్దకు అనుమతించే ధైర్యం టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు.

https://twitter.com/RojaSelvamaniRK/status/1912789442445894027

191 ఆవుల మరణం
సవాల్‌ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ నిలదీసారు. అని నిల‌దీశారు. కూటమి ప్రభుత్వంలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నార‌ని, శ్రీవారి ఆలయం పై డ్రోన్లు తిరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు క్యూలైన్‌లో తొక్కిసలాటపై ఒక్క అరెస్ట్‌ జరిగిందా అని ఫైర్ అయ్యారు. సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్‌ కల్యాణ్‌ అని నిలదీసిన రోజా.. టీటీడీ గోశాలలో గత ఏడాది కాలంలో మరణించిన ఆవుల జాబితా అక్కడి అధికారుల నుంచి సేకరించి సోషల్ మీడియా వేదికగా బయట పెట్టారు. రోజా విడుదల చేసిన జాబితాలో టీటీడీ గోశాల అధికారులు వెల్లడించిన లెక్కల మేరకు 2024 ఏప్రిల్ - మార్చి 2025 నెలవరకు చనిపోయిన గోవులు 191 గా తేల్చారు. దీంతో, ఒక్క ఆవు చనిపోలేదు అంటున్న సీఎం చంద్రబాబు.. కూటమి నేతలు సమాధానం చెప్పాలని రోజా డిమాండ్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+