బాబు వల్లే: అవిశ్వాసంపై రోజా రివర్స్ కౌంటర్, 'బీజేపీ సమావేశాలకు పవన్ కళ్యాణ్'
అమరావతి: పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీలను బీజేపీ రంగంలోకి దింపిందని, వైసీపీ, జనసేన, బీజేపీలు అంతా కుమ్మక్కయ్యారన్న సీఎం చంద్రబాబు, టీడీపీ నేతల వ్యాఖ్యలకు వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు.

టీడీపీ బీజేపీ కొమ్ముకాస్తోంది
తెలుగుదేశం పార్టీ బీజేపీకి కొమ్ము కాస్తోందని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అవిశ్వాసంపై చర్చకు రాకుండా అడ్డుకోవడంలో చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అవినీతిలపై సీబీఐ విచారణ జరపాలన్నారు.

పవన్ కళ్యాణ్ ఎన్ని నాటకాలు ఆడినా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్ని నాటకాలు ఆడినా చేసేదేమీ లేదని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వేరుగా అన్నారు. నాడు ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూ అని, హోదానే కావాలని చెప్పిన పవన్ నేడు హోదా అంటున్నారని ధ్వజమెత్తారు.

బీజేపీకి అనుగుణంగా నటన
బీజేపీ స్క్రిప్ట్‌కు అనుగుణంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. దమ్ముంటే పోలవరంలో అవినీతి జరిగిందని చేసిన ఆరోపణలను పవన్ నిరూపించుకోవాలని సవాల్ చేశారు.

బీజేపీ సమావేశాలకు పవన్ కళ్యాణ్
పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిరూపిస్తే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని ఆంజనేయాలు అన్నారు. ఉద్దేశ్య పూర్వకంగా పవన్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ సమావేశాలకు పవన్ హాజరవుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications