మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు..ఇదేనా.. మంచి ప్రభుత్వం..?
ఏపీలో నూతన మద్యం పాలసీ అమలు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఏపీలో భారీగా మద్యం షాపులు వెలిశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు వైన్స్ షాపులలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి.అయితే కొందరు వ్యక్తులు మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా ఇల్లీగల్‌గా మద్యాన్ని అమ్మేస్తున్నారు. ఏ మాత్రం భయంలేకుండా బహిరంగంగా మద్యం బాటిళ్లు వరుసగా పేర్చి వ్యాపారం చేస్తున్నారు
. ఇలా బహిరంగంగా అమ్మకాలు చేపట్టడంతో కొందరు యువకులు వీడియోలు తీశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై మాజీ మంత్రి రోజా స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీని ఏం చేయాలనుకుంటున్నారని కూటమి ప్రభుత్వాన్ని రోజా ప్రశ్నించారు. జగన్ ఆంధ్రప్రదేశ్‌ను విద్యాంధ్రప్రదేశ్‌గా మారిస్తే...చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారంటూ రోజా విమర్శించారు. ఈ వీడియోలో పిల్లాడిని చూడండి.. సంతలోనే నేరుగా మద్యాన్ని అమ్ముతున్నాడు. ఏపీలో బెల్టుషాపులను ఎలా నిర్వహిస్తున్నారో ఈ వీడియోను చూస్తే అర్థం అవుతోందని ఆమె తెలిపారు.చిన్నపిల్లల్ని.. విద్యార్థులని పెట్టి మద్యం అమ్మిస్తున్నారంటూ చంద్రబాబు సర్కార్‌పై రోజా మండిపడ్డారు.
జగనన్న విద్యాంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తే..
— Roja Selvamani (@RojaSelvamaniRK) October 28, 2024
చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు..
ఈ వీడియో చూడండి...
ఏపీలో బెల్టుషాపులను ఎలా నిర్వహిస్తున్నారో..
చిన్నపిల్లల్ని.. విద్యార్థులని పెట్టి మద్యం అమ్మిస్తున్నారు..
ఇది ఎక్కడో కాదు..
చంద్రబాబు కి ఓటేసిన ఆంధ్రప్రదేశ్ లోనే… pic.twitter.com/8UG1ZGT3lK
తణుకులో ఇలా విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు వెలిశాయి. టీడీపీ నేతలే మద్యం షాపులు, బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు..ఇళ్ల మధ్యలో, మహిళలు నడిచేమార్గాల్లో ,చిన్నపిల్లల్ని పెట్టి ఇలా మద్యం అమ్మిస్తున్నారంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదుకోవాల్సిన విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని ఆమె దుయ్యపట్టారు. ఇదేనా.. మంచి ప్రభుత్వం..? చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఆమె ప్రశ్నించారు. తన దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన అధికారిక ట్విటర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications