అమరావతికి ఎన్టీఆర్, రామ్‌చరణ్- జాయింట్‌గా: పవన్‌తో..!!
Jr NTR and Ram Charan: ఇటీవలే కురిసిన భారీ వర్షాలు, దానివల్ల సంభవించిన వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురయ్యాయి. దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు, చెరువులు ఏకం అయ్యాయి. జనావాసాలన్నీ జలమయం అయ్యాయి.
ప్రత్యేకించి- రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం నీట మునిగింది. విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వరద ఉధృతి నెలకొంది. వేలాదిమందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు.

అదే తరహా పరిస్థితులు తెలంగాణలోనూ ఏర్పడ్డాయి. ప్రత్యేకించి- ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట్ జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి. విజయవాడలో బుడమేరు తరహాలోనే ఖమ్మంలో మున్నేరు వాగు పొంగిపొర్లింది. ఈ నగరాన్ని ముంచెత్తింది. మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయం అయ్యాయి.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల చొప్పున విరాళాన్ని ఇదివరకే ప్రకటించారు.
ఇప్పుడా మొత్తాన్ని చంద్రబాబు నాయుడికి అందజేయడానికి నేడు వారిద్దరూ ఏపీకి రానున్నారు. ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలుసుకోనున్నారు. 50 లక్షల రూపాయల మొత్తంతో కూడిన చెక్‌ను వారిద్దరూ చంద్రబాబుకు అందజేయనున్నారు.
ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం.. దేవర పార్ట్-1. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అతని సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్.. ఇతర కీలక పాత్రలను పోషించారు. కొరటాల శివ దర్శకుడు. యువ సుధ ఆర్ట్స్, హీరో నందమూరి కల్యాణ్ రామ్‌కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్.. సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నాయి.
ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతోంది దేవర. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. సినిమా సత్తాను చాటి చెప్పింది. ఆచార్య డిజాస్టర్ తరువాత కొరటాల శివ నుంచి వస్తోండటం, దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కాబోతోండటం వల్ల హైప్ ఏర్పడింది.












Click it and Unblock the Notifications