వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరీ ఇంత చౌకా?: ఎకరం లక్షకు ఇవ్వమంటే.. ఏకంగా రూపాయికే ఇచ్చేశారు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఎకరం రూ.లక్ష చొప్పున భూమి కేటాయించాలని అడిగితే ప్రభుత్వం ఏకంగా రూపాయికి ఎకరం చొప్పున కేటాయించేసింది. ఇంత చౌక బేరం ఎక్కడా, ఎప్పుడూ, ఏ ప్రభుత్వ హయాంలోనూ జరిగి ఉండదు. ఈ ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడికే దక్కుతుంది.

వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి 638.83 ఎకరాలు కేటాయించాలని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కార్పొరేషన్ లిమిటెడ్(బీఐఏసీఎల్) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

దీనిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలోని ఓర్వకల్, కన్నమడకలన, పుదిచెర్ల ప్రాంతాల్లో ఏకరం రూ.8 లక్షల మార్కెట్ ధరతో 638.83 ఎకరాలు కేటాయించవచ్చంటూ గత ఏడాది నవంబర్ 12వ తేదీన ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు.

Rs 1 for Acre.. 639 acres alienated for Greenfield airport in Kurnool district

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ(ఏపీఎల్ఎంఏ) గత ఏడాది నవంబర్ 17న సమావేశమై కర్నూలు జిల్లా కలెక్టర్ ప్రతిపాదనను యథాతథంగా ఆమోదించింది.

ఎకరం రూ.8 లక్షల మార్కెట్ ధరతో బీఐఏసీఎల్ కు 638.83 ఎకరాల భూమి కేటాయించాలని
ఏపీఎల్ఎంఏ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా ఆమోదించింది. ఈ మేరకు ఎకరం రూ.8 లక్షల ధరతో 638.83 ఎకరాలను బీఐఏసీఎల్ కు కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలంలోని ఓర్వకల్ కన్నమడకల, పుదిచెర్ల ప్రాంతాల్లో కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఫిబ్రవరి 3న జీవో నంబరు 46 జారీ చేసింది. మార్కెట్ విలువకు ఈ సంస్థకు భూమి కేటాయించినట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.

ఆఘమేఘాలపై ధర తగ్గింపు ఉత్తర్వులు..

అయితే ప్రజాప్రయోజనాల కోసమే విమానాశ్రయం నిర్మాణానికి ముందుకొచ్చామని, ఇంత ధరతో భూమి కేటాయిస్తే గిట్టుబాటు కాదని, ఎకరం రూ.లక్షకు కేటాయించాలంటూ బీఐఏసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిబ్రవరి 6న లేఖ రాయడంతో ప్రభుత్వం సత్వరమే స్పందించింది. ఎకరం రూపాయికే కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేసీ శర్మ ఆదివారం ఉత్తర్వులు ఇవ్వగా, రెవెన్యూ శాఖ ఎకరం భూమి రూపాయికే కేటాయిస్తున్నట్లు సోమవారం జీవో నంబరు 107ను జారీ చేసింది. ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు.

ప్రభుత్వం ద్వంద్వ వైఖరి...

భూ కేటాయింపుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అధికార వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒక్కో సంస్థ విషయంలో ఒక్కో విధంగా వ్యవహరించడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

విశాఖపట్నం భీముని పట్నం మండలంలోని కాపులుప్పాడలో ఇండియన్ నేవీకి 100 ఎకరాలు.. ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయిస్తూ 2003 డిసెంబరు 3వ తేదీన టీడీపీ ప్రభుత్వం జీవో నంబరు 1241 జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇండియన్ నేవీ రూ.5 కోట్లు చెల్లించింది కూడా. తీరా భూమిని తమకు అప్పగించాలంటూ నేవీ అధికారులు కోరగా రాష్ట్ర ప్రభుత్వం అడ్డం తిరిగింది. అంత భూమిని కేటాయించలేమని, తగ్గించుకోవాలని నేవీకి స్పష్టం చేసింది.

నేవీ 100 అడిగితే.. 65 ఎకరాలే

రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో చర్చలు జరిపిన ఇండియన్ నేవీ అధికారులు 80 ఎకరాలతో సరిపెట్టుకునేందుకు నిర్ణయించుకోగా, చివరికి అంత భూమి కూడా కేటాయించకుండా 65 ఎకరాలతోనే సరిపెట్టుకోవాలంటూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది.

తాము ఎకరానికి రూ.5 లక్షల చొప్పున 100 ఎకరాలకు రూ.5 కోట్లు చెల్లించామని, ఇప్పుడు కేవలం 65 ఎకరాలే ఇస్తున్నందున.. మిగతా 35 ఎకరాలకు తాము చెల్లించిన డబ్బు అయినా తమకు తిరిగి ఇవ్వాలంటూ నేవీ కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు.

డబ్బూ తిరిగివ్వని వైనం...

చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని, ఆ మొత్తం డబ్బును 65 ఏకరాలకే సర్దుకుంటామంటూ రాష్ట్రప్రభుత్వం గత నెల 21న జీవో నంబరు 80 జారీ చేయడంతో నేవీ అధికారులు అవాక్కయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి ఈ ఉదంతం ఒక మచ్చుతునక మాత్రమే.

English summary
VIJAYAWADA: The State government on Friday permitted the Revenue Department to alienate nearly 639 acres in Orvakal, Pudicherla and Kannamadakala villages in Kurnool in favour of the Managing Director of Bhogapuram International Airport Corporation Limited (BIACL) for establishment of a Greenfield airport at Orvakal. The allotment is subject to payment of market value at the rate of ₹8 lakh per acre and some other conditions. As per G.O MS No. 46, of the 639 acres, 456 acres are in Pudicherla, 115 acres in Orvakal and the remaining 67 acres in Kannamadakala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X