ఏపీకి రూ.28,346 కోట్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్ - సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన కార్యక్రమాల్లో ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. మొదటగా కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన సీఎం, రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలతో కలిసి సమావేశమయ్యారు.
ఈ భేటీలో రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టుల అభివృద్ధి, ప్రధాని సూర్యఘర్ పథకం అమలుపై చర్చ జరిగింది. అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఆర్ పాటిల్‌లతో కూడా సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు.

ప్రెస్‌మీట్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా కేంద్రం సహకరిస్తోందన్నారు. రూ. 28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ను మంజూరు చేయాలని కోరగా, ప్రహ్లాద్ జోష్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సూర్యఘర్ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 10వేల కుటుంబాలకు విద్యుత్‌ను అందించనున్నట్లు తెలిపారు. ఇక, తిరుపతిలోని ఐఐటీలో డీఆర్‌డీవో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications