తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారి భక్తులకు షాక్: రూ.50 సుదర్శనం టికెట్లు రద్దు చేసిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీవారి భక్తులకు మరో షాకిచ్చింది. ఎన్నో ఏళ్లుగా సాధారణ భక్తులకు అందుబాటులో ఉన్న రూ.50 సుదర్శనం టికెట్లను రద్దు చేసింది.

|
Google Oneindia TeluguNews

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీవారి భక్తులకు మరో షాకిచ్చింది. ఎన్నో ఏళ్లుగా సాధారణ భక్తులకు అందుబాటులో ఉన్న రూ.50 సుదర్శనం టికెట్లను రద్దు చేసింది. విడతలవారీగా ఈ టికెట్ల కోటాను తగ్గిస్తూ వచ్చిన టీటీడీ.. ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయిలో రద్దు చేసింది.

మధ్యతరగతి భక్తుల కోసం..

మధ్యతరగతి భక్తుల కోసం..

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే మధ్యతరగతి భక్తులను దృష్టిలో పెట్టుకుని గత ఈవో రమణాచారి రూ.50 సుదర్శన దర్శనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ-దర్శన కౌంటర్ల ద్వారా టికెట్లను కేటాయించేవారు. దాదాపు 50 శాతానికిపైగా ఈ టికెట్లను పొందిన మధ్యతరగతి భక్తులు శ్రీవారిని శ్రీఘ్రంగా దర్శించుకుంటున్నారు.

కోత మొదలు..

కోత మొదలు..

అప్పట్లో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఈ భక్తులకు మాత్రమే 8 కంపార్లుమెంట్లను కేటాయించారు. ఆతర్వాత ఈవోగా వచ్చిన ఐవైఆర్‌ కృష్ణారావు రూ.300 శీఘ్రదర్శనం విధానాన్ని అమలు చేశారు. దీంతో రూ.50 సుదర్శనం టికెట్ల కేటాయింపులో కోత విధించారు.

రూ.300 టికెట్ల పెంపు..

రూ.300 టికెట్ల పెంపు..

ఆ తర్వాత ఈవోగా పనిచేసిన గోపాల్‌.. రూ.300 ఆన్‌లైన్ ప్రత్యేక దర్శన విధానానికి శ్రీకారం చుట్టారు. క్యూలైనలో నిరీక్షణ లేకుండా ఇంటర్నెట్‌ ద్వారా బుక్‌ చేసుకున్న సమయాల్లో శ్రీవారిని దర్శించుకునే చర్యలు తీసుకోవడంతోపాటు కోటాను భారీగా పెంచారు.

సాధారణ భక్తులకు షాకే..

సాధారణ భక్తులకు షాకే..

ఈ క్రమంలో రూ.50 సుదర్శన టికెట్ల కేటాయింపు తగ్గుతూ వచ్చింది. ఆన్‌లైన్ దర్శన విధానానికి మంచి స్పందన లభిస్తుండటంతో సుదర్శన టికెట్లను సోమ, మంగళ, బుధవారాల్లో(వారానికి 3 రోజులు) మాత్రమే మంజూరు చేయడం ప్రారంభించారు. ఇక ఏప్రిల్ 1 నుంచి రూ.50 సుదర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేశారు. దీనిపై ఎలాంటి ప్రకటన కూడా చేయకపోవడం గమనార్హం. రూ.50 సుదర్శనం టికెట్ల రద్దుతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణ భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉండే ఈ టికెట్లను రద్దు చేయడమేంటని భక్తులు మండిపడుతున్నారు.

English summary
Rs 50 sudarsanam tickets has been cancelled by Tirumala Tirupati Devasthanam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X